తిరగబడ్డ విద్యార్థినులు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 12 September 2023

తిరగబడ్డ విద్యార్థినులు !


బీహార్ లోని వైశాలి జిల్లాలోని మహనార్ బ్లాక్ లో ప్రభుత్వ గర్ల్స్ స్కూల్ లో బెంచీలు, క్లాస్ రూమ్ లు సరిగా లేవని విద్యాశాఖ అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లారు. అయినా ఏం లాభం లేకపోయింది. దాంతో స్కూల్ విద్యార్థినులంతా కలిసి మంగళవారం నిరసనకు దిగారు. వెనక్కకు తగ్గాలని టీచర్లు ఎంత చెప్పినా వినకపోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థినులకు చెదరగొట్టేందుకు కొందరు లేడీ పోలీసులు స్టూడెంట్స్ పై లాఠీ చార్జి చేశారు. దాంతో ఆగ్రహించిన స్టూడెంట్స్.. పోలీస్ కారుపై దాడి చేశారు. కుర్చీలు, కర్రలతో అద్దాలు పగలగొట్టారు. ఈ ఘటనతో మదన్ చౌక్ ప్రధాన రహదారి దిగ్భందం అయింది. పోలీస్ అధికారి చేయి చేసుకున్న తర్వాతే తాము ఈ విధ్వంసానికి పాల్పడ్డామని, తమ సమస్యలు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

No comments:

Post a Comment