బీజేపీకి చంద్ర కుమార్‌ బోస్‌ రాజీనామా ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 6 September 2023

బీజేపీకి చంద్ర కుమార్‌ బోస్‌ రాజీనామా !


నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మనవడు, బెంగాల్‌ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు చంద్ర కుమార్‌ బోస్‌ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేతాజీ దార్శనికతను ప్రచారం చేస్తామన్న హామీని ఆ పార్టీ పార్టీ నిలబెట్టుకోలేదని, అందుకే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు చంద్ర కుమార్‌ బోస్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజీనామా లేఖ పంపారు. బీజేపీ వేదికగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, శరత్ చంద్రబోస్ సిద్ధాంతాలను నేటి తరానికి అందించాలని భావించానని అందుకు పార్టీ హైకమాండ్‌ కూడా గతంలో ఓకే చెప్పిందని చంద్రకుమార్ బోస్ అన్నారు. అయితే ఆ లక్ష్యాలను సాధించడంలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో పార్టీ నుంచి తనకు ఎలాంటి సహకారం లభించట్లేదని, తన ప్రతిపాదనలను అసలు పట్టించుకోవడం లేదని ఆయన లేఖలో వాపోయారు. 2016లో బీజేపీలో చేరిన చంద్ర కుమార్‌ బోస్‌ను హైకమాండ్ బెంగాల్‌ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమించింది. ఆ ఏడాది జరిగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇచ్చింది. అయితే ఎన్నికల్లో చంద్ర కుమార్ ఓడిపోయారు ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. 2020లో పార్టీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా చంద్ర కుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించారు. అయితే బీజేపీ విధానాలను చంద్రకుమార్ బోస్ పలుమార్లు వ్యతిరేకించారు.

No comments:

Post a Comment