చంటి పాపతో ఆఫీస్‌లో పని చేసిన మేయర్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 18 September 2023

చంటి పాపతో ఆఫీస్‌లో పని చేసిన మేయర్ !


దేశంలోనే అతి పిన్న వయస్సు కలిగిన మేయర్ మరో సారి దేశం దృష్టిని ఆకర్షించారు. తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ తన నెల రోజుల పాపతో కార్యాలయంలో పనిచేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాపని లాలిస్తూ ఫైళ్లను సమీక్షిస్తున్న చిత్రం ఆకట్టుకుంటోంది. వృత్తిపరమైన, వ్యక్తిగత బాధ్యతలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆమె గడుపుతున్న జీవితం స్ఫూర్తిదాయకం అని చాలా మంది ప్రశంసిస్తున్నారు. మాతృత్వం మహిళల ఆశయాలకు ఆటంకం కాదనే ఆలోచనకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిందని అంటున్నారు. మరి కొందరు మిశ్రమంగా స్పందించారు. కూలీలు తమ పిల్లలను నడుముకు కట్టుకుని బరువులు ఎత్తుకున్నప్పుడు కలిగే బాధ వర్ణనాతీతమని మాతృత్వానికి ఏదీ అడ్డు కాదని అన్నారు. ఆర్య రాజేంద్రన్(24) 2020లో 21 సంవత్సరాల వయస్సులో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు దేశంలోనే అతి పిన్న వయస్కురాలిగా మేయర్ గా బాధ్యతలు చేపట్టిన మహిళగా రికార్డు నెలకొల్పారు. ఆమె కేరళ ఎమ్మెల్యే సచిన్ దేవ్‌ను వివాహం చేసుకున్నారు. 

No comments:

Post a Comment