జమిలి కమిటీ సన్నాహక భేటీ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 3 September 2023

జమిలి కమిటీ సన్నాహక భేటీ !


మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ ప్రక్రియ కార్యాచరణపై న్యాయ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారుల బృందం ఆదివారం కలుసుకుంది. దేశంలో జమిలి ఎన్నికల విధివిధానాల సాధ్యాసాధ్యాల గురించి విశ్లేషణకు మాజీ రాష్ట్రపతి కోవింద్ సారధ్యంలో ఎనమండుగురు సభ్యుల కమిటీని కేంద్ర ప్రభుత్వం శనివారం నియమించింది. సాధ్యమైనంత త్వరగా కమిటీ నివేదిక అందించాలని సూచించింది. ఈ క్రమంలోనే ఆదివారం న్యాయ మంత్రిత్వశాఖ అధికారులు కోవింద్‌ను కలిసి ఆయనకు జమిలి ఆలోచనల గురించి సన్నాహాక వివరణ ఇచ్చిందని వెల్లడైంది. జమిలి విషయంపై అధ్యయనం, నిర్వహణకు తగు సిఫార్సుల గురించి మాజీ రాష్ట్రపతికి విన్నవించినట్లు అత్యున్నత స్థాయి వర్గాల ద్వారా వెల్లడైంది. లా సెక్రెటరీ నితిన్ చంద్ర, లెజిస్లేటివ్ సెక్రెటరీ రీటా వశిష్ట ఇతరులు మాజీ రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. కమిటి అజెండా రూపకల్పన గురించి మాజీ రాష్ట్రపతితో వీరు చర్చించినట్లు తెలిసింది. అంతకు ముందు జమిలి విషయంపై ప్రభుత్వ వైఖరిని కూడా వివరించారు. ఇప్పుడు మాజీ రాష్ట్రపతిని కలిసిన నితిన్ చంద్ర జమిలిపై ఏర్పాటు అయిన అత్యున్నత అష్ట సభ్య కమిటీలో సెక్రెటరీగా కూడా ఉన్నారు. కాగా రీటా వశిష్ట ఎన్నికల నిర్వహణ, ప్రజా ప్రాతినిధ్య చట్టం, సంబంధిత లెజిస్లేటివ్ విషయాలను పర్యవేక్షిస్తున్నారు. జమిలి కమిటీ సభ్యుల పేర్ల వెల్లడికి ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఓ తీర్మానం ఎందుకు వెలువరించాల్సి వచ్చిందనే ప్రశ్నకు అధికారులు స్పందించారు. తాము మంత్రిత్వశాఖ ఆదేశాలను పాటిస్తున్నామని తెలిపారు. ఇంతకు ముందు ఇందర్‌జిత్ గుప్తా కమిటీని కూడా ఇదే విధంగా ప్రకటించారని , దీనినే అనుసరించారని వివరించారు. జమిలి కమిటి సభ్యుల పేర్ల వెల్లడి దశలో వెలువరించిన తీర్మానంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏకకాల ఎన్నికల నిర్వహణ సముచితం అని తెలిపింది జాతీయ ప్రయోజనాల కోణంలో ఇది అత్యవసరం సముచితం అని పేర్కొంది. అసెంబ్లీలు, లోక్‌సభకు ఏక కాల ఎన్నికల వల్ల తరచూ ఎన్నికల నిర్వహణ వ్యయభారం తగ్గుతుంది. పైగా ప్రగతి పనులలో ఆటంకం ఏర్పడుతుందని, దీని నివారణకు జమిలి ఎన్నికలే సముచితం అని తెలియచేస్తూ సంబంధిత విషయాలను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు, కమిటీలోని వారి పేర్లను వెల్లడించింది. జమిలి ఎన్నికల నిర్వహణ కమిటీ ఏర్పాటు కీలకమైన విధాన నిర్ణయం కాబట్టి సంబంధిత విషయంపై ముందుగా నిర్ణయాన్ని అధికారికంగా వెలువరించడం, తరువాత నోటిఫికేష్ వెలువరించడం జరిగిందని అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment