వెండి, బంగారు పూత పాత్రల వినియోగం అవసరమా ? - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 11 September 2023

వెండి, బంగారు పూత పాత్రల వినియోగం అవసరమా ?


ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశాలలో జరిగిన విందులో భాగంగా వెండి, బంగారు పూత పాత్రలను ఉపయోగించడంపై కేంద్రం ప్రభుత్వం మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అతిథుల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది కానీ, మరీ ఇంత ఆర్భాటం ఏమాత్రం అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై తాజాగా ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ తీవ్రంగా విమర్శించారు. ముంబయిలో విలేకరుల సమావేశాలో శరద్ పవార్ మాట్లాడుతూ ''గతంలో మన భారత్‌లో ఇలాంటి కార్యక్రమాలు రెండుసార్లు జరిగాయి. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఈవెంట్ ఒకటి జరిగింది. అయితే ఈ ఈవెంట్స్‌లో అతిథుల విందు కోసం వెండి వస్తువులు గానీ, బంగారు పూత పూసిన పాత్రలను గానీ ఉపయోగించినట్లు నేను ఎప్పుడూ వినలేదు. భారత్‌కు వచ్చే ప్రపంచ అగ్రనేతలను గౌరవించాల్సిన అవసరం ఉంది. అది దేశానికి ముఖ్యమైనది కూడా. కానీ  ముఖ్యమైన సమస్యల్ని పక్కనపెట్టి, కేవలం కొంతమంది వ్యక్తుల స్థాయిని పెంచడానికి ఇలాంటి కార్యక్రమాల్ని దుర్వినియోగం చేయడం ఏమాత్రం సబబు కాదు'' అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు.. దేశాధినేతలతో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై చర్చించాలని శరద్ పవార్ సూచించారు. చర్చించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని.. కానీ, ఇలాంటి ఆర్భాటాలు వల్ల ఆ సమస్యల్ని పక్కదారి పట్టించినట్లు అవుతుందని పేర్కొన్నారు. అటు.. నెటిజన్లు సైతం ''ఐశ్వర్యాన్ని ప్రదర్శించడం కోసం ప్రజాధనాన్ని విపరీతంగా ఖర్చు చేయడం అర్థరహితం'' అంటూ ట్విటర్ మాధ్యమంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment