వన్ నేషన్ -వన్ ఎలక్షన్ కమిటీ సభ్యులు నియామకం

Telugu Lo Computer
0


వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఎన్నికలు సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం 8 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమితులయ్యారు. కమిటీ సభ్యులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి,గులాం నబీ ఆజాద్, ఎన్ .కె సింగ్, సుభాష్ సి. కశ్యప్, హరీశ్ సాల్వే, సంజయ్ కొటారీ నియమితులయ్యారు. వన్ నేషన్ వన్ పోల్ సాధ్యమేనా.. ? అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నిలకు రాష్ట్రాలు ఒప్పుకుంటాయా..? మోదీ ప్రభుత్వం ఒప్పిస్తుందా..? ఇప్పటివరకు లా కమిషన్ ద్వారా నివేదికపై ఆధారపడిన మోదీ ప్రభుత్వం.. తాజా మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా సమస్యపై నిర్ణయాత్మకంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే సెప్టెంబర్ నెలాఖరులో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్.. వన్ పోల్ బిల్లు వచ్చే అవకాశం లేదంటున్నారు నిపుణులు.  ఒకవేళ బిల్లు ప్రవేశపెట్టే అశకాశం ఉన్నా.. వన్ నేషన్.. వన్ పోల్ ద్వారా లోక్ సభతో పాటు ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాలను మోదీ ప్రభుత్వం ఒప్పించాల్సి ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)