ఎడిటర్స్‌ గిల్డ్‌పై ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయండి !

Telugu Lo Computer
0


డిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఇజిఐ)కి వ్యతిరేకంగా మణిపూర్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఢిల్లీ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (డియుజె) తీవ్రంగా ఖండించింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మణిపూర్‌లో సుమారు నాలుగు నెలల నుంచి కొనసాగుతున్న హింసాకాండపై ఇజిఐ నిజ నిర్ధారణ బృందం ఇటీవల 24 పేజీలతో కూడిన ఒక నివేదికను వెల్లడించింది. ఈ నివేదికను సవాల్‌ చేస్తూ ఒక స్థానిక సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఈ బృందంలోని సభ్యులు సీమా గుహ, సంజరుకపూర్‌, భరత్‌ భూషణ్‌తో పాటు ఇజిఐ అధ్యక్షులు సీమా ముస్తాఫాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. తటస్థ నిపుణులతో కూడిన ఇజిఐ ఇచ్చిన నివేదిక పక్షపాతమని ఆరోపించడం అసంబద్ధమని డియుజె తన ప్రకటనలో ఖండించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)