రాజ్ ఘాట్ వద్ద టీడీపీ ఎంపీల మౌనదీక్ష ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 19 September 2023

రాజ్ ఘాట్ వద్ద టీడీపీ ఎంపీల మౌనదీక్ష !


ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును తప్పుడు కేసులతో జైలుకు పంపడాన్ని నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో టిడిపి నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో టిడిపి ఎంపిలు, మాజీ ఎంపిలు మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘాట్ వద్ద మంగళవారం ఉదయం మౌనదీక్ష చేపట్టారు. తొలుత మహాత్ముడికి నివాళులర్పించిన నాయకులు అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఎంపిలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రులు కిమిడి కళావెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసులు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎంపిలు నిమ్మల కిష్టప్ప, బికె పార్థసారధి, కొనకళ్ల నారాయణ, మురళీమోహన్, కంభంపాటి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుపై జాతీయస్థాయి నాయకులు తమ గళాన్ని వినిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు వైసిపి ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమని, తెలుగుప్రజలకు ఆయన చేసిన సేవలను చెరిపివేయలేరని ఎండిఎంకె నేత వైగో పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు, తదనంతర పరిణామాలపై టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ లోక్ సభలో ఆందోళన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment