మల్లికార్జున ఖర్గే ప్రసంగానికి అడ్డుపడిన బీజేపీ నేతలు !

Telugu Lo Computer
0


కేంద్ర మంత్రి మేఘ్వాల్ నారీశక్తి వందన్ పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే  చేసిన వ్యాఖ్యలపై బిజెపి మహిళా నేతలు మండిపడ్డారు. మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ ’2010లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. వెనకబడిన వర్గాల మహిళలకు కూడా అవకాశాలు దక్కాలి. అన్ని పార్టీలు మహిళలను చిన్నచూపు చూస్తున్నాయి. ప్రశ్నించలేని మహిళలకు అవకాశం ఇచ్చారు" అని ఖర్గే మాట్లాడారు. దీంతో మహిళా నేతలను కించపరిచే విధంగా మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతున్నారని ఆయన ప్రసంగాన్ని బిజెపి నేతలు అడ్డుకున్నారు. ఆయన ప్రసంగం ఆపాలని పట్టుబట్టారు. చివరికి గందరగోళం ఏర్పడటంతో సభను వాయిదా వేశారు. మరోపక్క మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిరాకరించారు. ఈ బిల్లుకు మీరు మద్దతిస్తారా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. సరైన సమయం రాకుండా దీనిపై తాను వ్యాఖ్యానించలేనన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)