రూ.2 వేల నోట్ల మార్పిడికి అక్టోబర్‌ 7 వరకు గడువు పెంపు !

Telugu Lo Computer
0


రూ.2000 నోట్ల ఉపసంహరణకు గడువు సెప్టెంబర్‌ 30తో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే గడువు పొడిగిస్తారా? లేదా అనేది సందిగ్ధంలో ఉండేది. కానీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది.రూ. 2000 నోట్లను మార్పిడి చేసుకునేందుకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 7వ తేదీ వరకు రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌  అవకాశం కల్పించింది. మే 19, 2023న 2000 రూపాయల నోట్లను చెలామణి నుంచి తొలగించేందుకు ఆర్బీఐ వినియోగదారులకు నాలుగు నెలల సమయం ఇచ్చింది. అయితే దీని గడువు ఈరోజుతో ముగుస్తుంది. తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పెద్ద నోట్లను ఉపసంహరణ కోసం నోట్లను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నోట్లు ఉన్నవారు బ్యాంకులో డిపాజిట్‌ చేసుకోవడం లేదా వాటి స్థానంలో వేరే నోట్లను మార్పిడి చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అయితే సెప్టెంబర్‌ 30తో గడువు ముగియనున్న నేపథ్యంలో గడువు పొడిగిస్తుందా..? లేదా అనే సందేహం చాలా మందిలో కలిగింది. అయితే ముందుగా ఆర్బీఐ ఈ నోట్ల మార్పిడికి గడువు పొడిగించేది లేదని భావించినా.. ఇతరుల నుంచి విజ్ఞప్తుల మేరకు తేదీని పొడిగిస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 30 వరకు ఉన్న గడువును అక్టోబర్‌ 7 వరకు పొడిగించడం  పెద్ద నోట్లు ఉన్నవారికి కొంత ఊరట కలించినట్లయ్యింది. అయితే ఈ నోట్లు కలిగిన వారు వెంటనే సమీపంలోని ఏదైనా బ్యాంకుకు వెళ్లి కూడా నోట్లను మార్పిడి చేసుకునే వెసులు బాటు ఉంది. గతంలో ఈ నోట్లను మార్పిడి చేసుకోవడం లేదా డిపాజిట్‌ చేయడం లాంటివి చేసినా ఆధారాలు ఇవ్వాలని, బ్యాంకు సిబ్బంది అడిగిన పత్రాలు ఇవ్వాలని వచ్చాయి. అలాంటి సమయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఎలాంటి ఆధారాలు అంటే ఆధార్‌, పాన్‌ కార్డు వంటి వివరాలు అందించకుండానే బ్యాంకులో సులభంగా నోట్లను మార్పిడి చేసుకోవడం, లేదా డిపాజిట్‌ చేసుకోవడం చేయవచ్చని స్పష్టం చేసింది. రోజుకు రూ.20 వేల చొప్పున ఈ రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు 93 శాతం వరకు ఈ రెండు వేల రూపాయల నోట్లు బ్యాంకులకు వచ్చాయని ఆర్బీఐ నివేదికలు తెలిపాయి. ఇప్పుడు గడువు పొడిగించడంతో కేవలం మరో వారం మాత్రమే ఉంది. ఈ రూ.2 వేల నోట్లు కలిగిన వారు వెంటనే బ్యాంకులో మార్పిడి చేసుకోవడం చాలా ముఖ్యం. లేకుండే గడువు తీరిన తర్వాత ఈ నోట్లు చిత్తు కాగితాలతో సమానంగా 

Post a Comment

0Comments

Post a Comment (0)