డ్రోన్లతో జొమాటో ఆర్డర్ల డెలివరీ !

Telugu Lo Computer
0


జొమాటో ఏజెంట్ రోజంతా ఆర్డర్లు డెలివరీ చేయాలి. కానీ ట్రాఫిక్ పెద్ద సమస్య. ట్రాఫిక్ లో పడితే అనుకున్న సమయానికి డెలివరీ ఇవ్వలేకపోతున్నాడు. ఓపిక కూడా పోతోంది. పిజ్జాలువంటివైతే చల్లారిపోతున్నాయి. దీంతో కష్టమర్ల నుంచి ఫిర్యాదులు. దీంతో జొమాటో డెలివరీ బోయ్ ఓ ఐడియా వేశాడు. ఆర్డర్లు డెలవరీ కోసం డ్రోన్ ను తయారు చేశాడు. ఈవినూత్న ఆలోచన చేసిన జొమాటో బోయ్ పేరు సోహన్ రాయ్. డ్రోన్ ను తయారు చేయటం, దానికి కారణాలు వివరిస్తూ ఓ వీడియో చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అదికాస్తా వైరల్ గా మారింది. జొమాటో డెలివరీ ఏజెంట్ గా రాయ్ రోజంతా పనిచేయాల్సి వచ్చేది. రోజులో ఎక్కువ టైమ్ పట్టేది. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోవడం సమయానికి డెలివరీ చేయలేకపోవటం పెద్ద ఇబ్బందిగా మారింది. ఒక్కోసారి గంటల సమయంలో ట్రాఫిక్ లోనే గడిచిపోయేది. ఈ బాధలకు పరిష్కారంగా అతడు డ్రోన్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. డ్రోన్ తయారు చేయడం, డెలివరీకి ముందు టెస్ట్ చేయడం, ఆ తర్వాత అదే డ్రోన్ తో పిజ్జాని డెలివరీ కోసం పంపించడాన్ని వీడియోలో చూపించాడు. డ్రోన్ డెలివరీ గురించి ఎప్పటి నుంచో వింటున్నా కానీ..దేశంలో ఇప్పటికీ అందుబాటులోకి రాలేదన్న విషయాన్ని అతడు గుర్తు చేశాడు. ప్రయోగాత్మకంగానే పరీక్షించి చూశానని, వాణిజ్య ఉత్పత్తి దశకు వచ్చే సరికి మరింత మెరుగ్గా తయారవుతుందని చెప్పుకొచ్చాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)