అమెజాన్, గూగుల్కు మీడియా హక్కులు !

Telugu Lo Computer
0


పీఎల్ మీడియా హక్కులను విక్రయించి భారీ లాభాలను ఆర్జించిన బీసీసీఐ.. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు  ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌ల నుండి సంపాదించాలని ప్లాన్ చేస్తుంది. తన బిడ్డింగ్ ద్వారా 750 మిలియన్ డాలర్లను ఆర్జించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ హక్కులను పొందే కంపెనీలు.. ఐదేళ్ల క్రితం ఎంత విలువ ఉందో అంతే విలువ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. మరోవైపు ద్వైపాక్షిక సిరీస్ లో 102 మ్యాచ్ లు ఉండవచ్చు. ఈ మ్యాచ్‌ల మీడియా హక్కుల రేసులో అమెజాన్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలను చేర్చుకోవాలని భావిస్తోన్న బీసీసీఐ, వేలం ప్రక్రియను రెండు వారాల పాటు వాయిదా వేసింది. మరోవైపు ఐపీఎల్, షార్ట్ ఫార్మాట్ క్రికెట్ మ్యాచ్‌ల మీడియా హక్కులను కొనుగోలు చేయడానికి కంపెనీలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. 2023 ఐపీఎల్ యొక్క వెబ్ టెలికాస్ట్ హక్కులను రిలయన్స్ కంపెనీ జియో సినిమా కొనుగోలు చేసింది. టీవీ హక్కులు స్టార్ ఇండియా వద్దనే ఉన్నప్పటికీ.. ఈ డీల్‌తో బీసీసీఐ భారీగానే సంపాదించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)