సుదర్శన్‌ న్యూస్‌' రెసిడెంట్‌ ఎడిటర్‌ ముఖేష్‌ కుమార్‌ అరెస్టు

Telugu Lo Computer
0


నుహ్ అల్లర్లలో జరిగిన మత హింస గురించి సోషల్‌మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్‌లు పెట్టారనే ఆరోపణలపై ప్రముఖ హిందీ న్యూస్‌ ఛానెల్‌ 'సుదర్శన్‌ న్యూస్‌' రెసిడెంట్‌ ఎడిటర్‌ ముఖేష్‌ కుమార్‌ని గురుగ్రామ్‌ సెక్టార్‌ 17 నుండి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఖేష్‌ని కొందరు గుండాలు కిడ్నాప్‌ చేశారని సుదర్శన్‌ న్యూస్‌ ఛానెల్‌ మొదట పేర్కొంది. అయితే సైబర్‌ క్రైమ్‌ విభాగం అతడిని అరెస్టు చేసినట్లు గురుగ్రామ్‌ పోలీసులు స్పష్టం చేశారు. కాగా, ఖతార్‌కు చెందిన అల్‌ జజీరా న్యూస్‌ ఛానెల్‌ మతపరమైన అల్లర్లకు సంబంధించి హిందువులపై చర్యలు తీసుకోవాలని గురుగ్రామ్‌ కమిషనర్‌ కళా రామచంద్రన్‌కి కాల్‌ చేస్తోందని ముఖేస్‌ ఆరోపిస్తూ ట్వీట్‌ చేశారు. అల్‌జజీరా మీడియా ఒత్తిడి మేరకే  గురుగ్రామ్‌ పోలీసులు హిందు కార్యకర్తలపై చర్యలు తీసుకుంటున్నారని ముఖేష్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే గురుగ్రామ్‌ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని.. సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని గురుగ్రామ్‌ పోలీసులు పేర్కొన్నారు. అతనిపై ఐటి చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుమార్‌ అరెస్టుకు వ్యతిరేకంగా సుదర్శన్‌ న్యూస్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ సురేష్‌ చవాన్కే సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కుమార్‌ని పోలీసులు విడుదల చేయకుంటే.. ఆ న్యూస్‌ ఛానెల్‌లో ఊహించని విధంగా బిగ్‌ ఎనౌన్స్‌మెంట్‌ చేస్తానని గురుగ్రామ్‌ పోలీసులను హెచ్చరించాడు. దీంతో గురుగ్రామ్‌ పోలీసులు కుమార్‌ని అరెస్టు చేసిన గంట తర్వాత ఎలాంటి ప్రకటన చేయకుండానే విడుదల చేయడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)