ఆర్డర్ చేసిన ఆహారానికి సమానంగా కంటైనర్ ధరలను వసూలు చేస్తారా?

Telugu Lo Computer
0

హ్మదాబాద్ కు చెందిన ఖుష్బూ ఠక్కర్ అనే మహిళ మూడు ప్లేట్లు తేప్లా (రోటీ లాంటిది) జొమాటో ద్వారా ఆర్డర్ చేశారు. డెలివరీ సమయంలో బాయ్ ఇచ్చిన బిల్లు చూసిన ఆమె అవాక్కైంది. అందులో మూడు ప్లేట్ల ఆహారానికి రూ.180 బిల్లు వేశారు. కేవలం ఆహారాన్ని ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే కంటైనర్ల కు రూ.60 వసూలు చేస్తున్నట్లు చూపించారు. తాను ఆర్డర్ చేసిన ఆహారానికి సమానంగా కంటైనర్ ధరలను వసూలు చేస్తారా? అంటూ ప్రశ్నించింది. కంటైనర్ పేరుతో అదనంగా సొమ్ము వసూలు చేశారంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. చివరకు జొమాటో ఖుష్బూ ఫిర్యాదుపై స్పందించింది. కంటైనర్ ఛార్జీలను రెస్టారెంట్లు మాత్రమే విధిస్తాయని చెప్పింది. హాయ్ ఖుష్బూ.. పన్ను విధించడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఆర్డర్ చేసిన ఫుడ్ కు అనుగుణంగా 5 శాతం 18 శాతం పన్ను ఛార్జీలుంటాయి. దీంతోపాటు రెస్టారెంట్లు ప్యాకేజీ ఛార్జీలను విధిస్తాయనే విషయాన్ని గుర్తెరగాలి. ఈ మార్గంలో కూడా వారు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని తెలుసుకోవాలంటూ జొమాటో బదులిచ్చింది. ఖుష్బూకు జొమాటో ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం ఆర్డర్ చేసేముందు ప్యాకేజీ ఛార్జీలు చూసుకొని ఉండాల్సింది అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)