పేగులను శుద్ధి చేసే ఆహారాలు !

Telugu Lo Computer
0


రోగ్యం బాగుండాలంటే పేగు/ జీర్ణవ్యవస్థ/ పొట్ట ఆరోగ్యం బాగుండటం చాలా అవసరం. పొట్టలో ఓవరాల్ హెల్త్‌కు మంచి చేసే బ్యాక్టీరియాతో పాటు చెడు బ్యాక్టీరియా కూడా ఉంటుంది. పేగులోని మంచి బ్యాక్టీరియా అనేది తిన్న ఆహారం చక్కగా జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పోషకాలు శరీరానికి బాగా వంటబట్టేలా చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను నియంత్రిస్తుంది. అందుకే మంచి బ్యాక్టీరియా అందించే ఆహారాలు డైట్‌లో భాగం చేసుకోవడం ముఖ్యం. మూడు రకాల పులియబెట్టిన ఆహారాల్లో ఈ మంచి బాక్టీరియా పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఇవి ఎంజైమ్‌లు, గట్ ఆరోగ్యాన్ని పెంపొందించే ఇతర పోషకాలను అందిస్తాయి. పెరుగు అనేది పాలతో చేసిన పులియబెట్టిన ఆహారం. ఇది ప్రేగులకు మేలు చేసే ప్రోబయోటిక్స్ అనే బ్యాక్టీరియా కలిగి ఉంటుంది. ఇందులో లభించే లాక్టోబాసిల్లస్ , బిఫిడోబాక్టీరియం వంటి మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడానికి, పోషకాలను శరీరం పూర్తిస్థాయిలో గ్రహించడానికి, రోగనిరోధక శక్తి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. పెరుగు కాల్షియం, ప్రోటీన్, విటమిన్ D లాంటి పోషకాలకు కూడా నిలయం. కొంబుచా అనేది స్వీట్‌గా ఉండే బ్లాక్ లేదా గ్రీన్ టీ. ఇది బ్యాక్టీరియా, ఈస్ట్ మిశ్రమంతో తయారు చేసే పులియబెట్టిన టీ. పులియబెట్టే ప్రక్రియ ప్రోబయోటిక్స్, ఎసిటిక్ యాసిడ్, కొంచెం ఆల్కహాల్‌ను సృష్టిస్తుంది. ఈ ప్రోబయోటిక్స్ జీర్ణాశయానికి మంచి బ్యాక్టీరియాను అందించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కొంబుచాలో యాంటీఆక్సిడెంట్లు, ఆర్గానిక్ యాసిడ్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి గట్ ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.

కిమ్చి అనేది క్యాబేజీ, ముల్లంగి వంటి పులియబెట్టిన కూరగాయలతో తయారు చేసే కొరియన్ వంటకం, దీనిని సుగంధ ద్రవ్యాలతో తయారుచేస్తారు. ఈ వంటకాన్ని తయారు చేసే ముందు పులియ బెడతారు. ఈ ప్రక్రియలో లాక్టోబాసిల్లస్ వంటి పేగు ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబయోటిక్స్‌ తయారవుతాయి. ఈ ప్రోబయోటిక్స్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచి గట్ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. కిమ్చిలో విటమిన్లు A, C, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. మొత్తం మీద జీర్ణాశయానికి ఆరోగ్యకరమైన ఎంపికగా ఇది మారుతుంది. మంచి గట్ హెల్త్ కోసం పులియబెట్టిన ఆహారాల్లో లైవ్, యాక్టివ్ బ్యాక్టీరియా ఉండాలి. వీటిని క్రమం తప్పకుండా తింటే అజీర్తి సమస్యలు మటుమాయం అవుతాయి. పేగు లేదా పొట్ట ఆరోగ్యం మొత్తం మెరుగుపడుతుంది. ఒక్కొక్కరి శరీరం ఇలాంటి ఆహారాలకు ఒక్కోలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ శరీరానికి పడని వాటికి దూరంగా ఉండటమే మంచిది. పైన పేర్కొన్న ఫెర్మెంటెడ్ ఫుడ్స్‌కు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. అందుకే వీటిలో మీకు ఏది సరైనదో తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Post a Comment

0Comments

Post a Comment (0)