ఆటో డ్రైవర్ స్మార్ట్ వాచ్ లో క్యూ ఆర్ కోడ్ !

Telugu Lo Computer
0


బెంగుళూరులో ఓ ఆటో డ్రైవర్ క్యూఆర్ కోడ్ ను తన స్మార్ట్ వాచ్ లో స్ర్కీన్ సేవ్ చేసి పెట్టుకున్నాడు. ఆన్ లైన్ చెల్లింపులు చేయాలనుకునే వారికి తన వాచ్ ను చూపించి పేమెంట్స్ పొందుతున్నాడు. ఈ విషయాన్ని ఓ ట్విట్టర్ యూజర్ పంచుకున్నారు. తాను ఇటీవల ఆటో ఎక్కానని, డ్రైవర్ కు డబ్బులు చెల్లించేందుకు 'నమ్మయాత్రి' సేవను ఎంచుకున్నానని చెప్పాడు. అయితే పేమెంట్ చేసేందుకు బార్ కోడ్ ను అడగగా, ఆ డ్రైవర్ తన చేతికున్న స్మార్ట్ వాచ్ చూపించాడని, అది చూసి తాను ఆశ్చర్యపోయానని రాసుకువచ్చాడు. అంతే కాదు ఈ ఘటనకు సంబంధించి ఆయన ఓ ఫొటోను కూడా షేర్ చేశాడు. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో ఇప్పుడు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆటో డ్రైవర్ తెలివిని మెచ్చుకుంటున్నారు. బెంగళూరులోని ఐటీ ఉద్యోగులకంటే ఆటో డ్రైవర్లు స్మార్ట్ గా మారారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆగస్టు 15న షేర్ అయిన ఈ ట్వీట్‌కు 3లక్షల 56వేల కంటే ఎక్కువ వ్యూస్స్, 7వేల 4వందల కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)