నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పుపై కాంగ్రెస్ ఆగ్రహం !

Telugu Lo Computer
0


నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ  పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా కేంద్రం మార్చింది. "నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ  సొసైటీగా మారిందని తెలుపుతూ వైస్-ఛైర్మన్ సూర్య ప్రకాష్ ట్వీట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. మ్యూజియం పేరులోని ఎన్ అక్షరాన్ని తొలగించి పీ ని చేర్చారని కాంగ్రెస్ విరుచుకుపడింది. మన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విషయంలో మోదీకి ఎన్నో భయాలు, అభద్రత వంటివి ఉన్నాయని ఆరోపించింది. నెహ్రూ, నెహ్రూవియన్ వారసత్వాన్ని తిరస్కరించడం, వక్రీకరించడం, పరువు తీయడం, నాశనం చేయడం అనే ఒకే పాయింట్ ఎజెండాను కలిగి ఉన్నారు. అందుకే N ను చెరిపివేసి, బదులుగా Pని పెట్టింది" అని తెలిపింది. స్వాతంత్య్రోద్యమంలో, జాతి నిర్మాణంలో నెహ్రూ చేసిన మహత్తర సేవలను ప్రధాని ఎన్నటికీ తీసిపారేయలేరని కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ ఇన్‌ఛార్జ్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేష్‌ కేంద్రంపై మండిపడ్డారు. జవహర్‌లాల్ నెహ్రూ వారసత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)