యూసీసీకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం

Telugu Lo Computer
0


యూనిఫామ్ సివిల్ కోడ్( యూసీసీ) బిల్లుని అమలు చేసి ఒకే దేశం- ఒకే చట్టం తీసుకురావాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ఈ ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేసింది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్‌ను కూడా వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసి.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా ఉపయోగించుకోవాలని కాషాయ పార్టీ తీవ్రంగా యోచిస్తోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. యూనిఫాం సివిల్ కోడ్ అమలును ఉపసంహరించుకోవాలని కేంద్ర సర్కార్ ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరాడు. దేశంలో యూసీసీ అమలు ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ.. కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వం నేడు రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. ఇక, కేరళ రాష్ట్రంలోని అధికార వామపక్షాలు, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, కేరళ రాష్ట్రంలోని వివిధ మతపరమైన సంస్థలు యూసీసీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. యూసీసీకి వ్యతిరేకంగా ఇటీవల కోజికోడ్‌లో రెండు ఫ్రంట్‌లు వేర్వేరుగా సెమినార్లు నిర్వహించాయి. ఈ సదస్సుల్లో వివిధ మత సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్రం తీసుకున్న ఒక దేశం, ఒకే సంస్కృతి అనే మెజారిటీ మతపరమైన ఎజెండాను అమలు చేసే ప్రణాళికగా మాత్రమే చూడాలని అయిన సీఎం పినరయి విజయన్ చెప్పారు. యూనిఫాం సివిల్‌ కోడ్‌ను విధించే చర్యను కేంద్ర ప్రభుత్వం, లా కమిషన్‌ విరమించుకోవాలని కేరళ సీఎం విజయన్ కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)