వీల్ చైర్‌లో రాజ్యసభకు మన్మోహన్ సింగ్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 8 August 2023

వీల్ చైర్‌లో రాజ్యసభకు మన్మోహన్ సింగ్ !


మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ 90 ఏళ్ల వయస్సులో రాజసభకు వీల్ చైర్ లో వచ్చారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ చాలాకాలం తరువాత పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా గానీ 90 ఏళ్ల వయస్సులో కూడా ఆయన తన బాధ్యతలను నిర్వహించేందుకు రాజ్యసభకు వచ్చారు. మంగళవారం  వీల్ చైర్ లో రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్ ఢిల్లీ సర్వీసెస్ బిల్లు కు ఓటు వేశారు. 90 ఏళ్ల వయస్సులో అనారోగ్యాన్ని కూడా లెక్క చేయయండా తన బాధ్యతను విస్మరించని మన్మోహన్ సింగ్ నిబంధతకు ప్రతిపక్ష నేతలంతా ప్రశంసించారు.కానీ బీజేపీ మాత్రం ఇది అత్యంత సిగ్గుచేటు అని పేర్కొంది. మన్మోమన్ సింగ్ ఆ పరిస్థితుల్లో కూడా తన బాధ్యతను విస్మిరించకుండా వచ్చి ఓటు వేసినందుకు..సభకు హాజరైనందుకు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చద్దా మాట్లాడుతూ ఈరోజు రాజ్యసభలో మన్మోహన్ సింగ్ చిత్తశుద్ధికి మారుపేరుగా నిలిచారు అంటూ కొనియాడారు. మరి ముఖ్యంగా బ్లాక్ ఆర్డినెన్స్ కు వ్యతిరేకింగా ఓటు వేయడానికి వచ్చినందుకు..ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధతకు స్ఫూర్తిగా నిలిచారు అంటూ కొనియాడారు. అతని అమూల్యమైన మద్ధతుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపుతున్నామన్నారు. కాగా 90 ఏళ్ల కురువద్ధుడు మన్మోహన్ సింగ్ రాజ్యసభకు వచ్చి ఓటు వేయటంపై ప్రతీపక్షాలు, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. బీజేపీ కాంగ్రెస్ పై మండిపడింది. కాంగ్రెస్ పిచ్చిన దేశం గుర్తుంచుకంటుంది అంటూ వ్యాఖ్యానించింది. ఇలాంటి అనారోగ్య పరిస్థితిలో కూడా మాజీ ప్రధానిని పార్లమెంట్ లో వీల్ చైర్ లో కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్ కు మాత్రమే దక్కుతుంది అంటూ మండిపడింది బీజేపీ. నిజాయితీ అనేది లేని కాంగ్రెస్ కుటుంబాన్ని బతికించుకోవటానికి మన్మోహన్ సింగ్ ఇంత సాహసం చేయటం దురదష్టకం అంటూదుయ్యబట్టింది. ఇది సిగ్గుచేటు అంటూ మండిపడింది. మన్మోహన్ సింగ్ రాజ్యసభకు హాజరు కావడంపై బీజేపీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాట్ మాట్లాడుతు మాజీ ప్రధానికి "ప్రజాస్వామ్యంపై విశ్వాసం" చూపుతుందని అన్నారు.

No comments:

Post a Comment