పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్, ఆప్ !

Telugu Lo Computer
0


లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో విపక్షాలు, అధికార పార్టీలు చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నాయి.ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించడమే లక్ష్యంగా పొత్తులు, ఎత్తులు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కీలకమైన గుజరాత్ రాష్ట్రాన్ని టార్గెట్ చేశాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నట్లు ఆప్ సీనియర్ నేత ఇసుదాన్ గధ్వి సోమవారం ప్రకటించారు. ఈ రెండు పార్టీలు భారత ఇండియా కూటమిలో ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఆప్ సీట్లు పంపకాలు చేసుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాయని గధ్వీ తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న 26 స్థానాలను బీజేపీ గెలుచుకోదని అన్నారు. 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు రాష్ట్రంలోని మొత్తం స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కొద్ది రోజుల క్రితం జరిగి గుజరాత్‌ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా 5 సీట్లు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పాలైంది. వాస్తవానికి ఆప్ పోటీనే కాంగ్రెస్ కే పెద్ద అడ్డంకి అయింది. ఆప్ దాదాపు 13 శాతం ఓట్లు సాధించి 5 సీట్లతో మూడో స్థానంలో నిలిచింది. దీంతో కాంగ్రెస్ పార్టీ బాగా నష్టపోయి, కాంగ్రెస్ కేవలం 17 సీట్లకు పరిమితమైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)