ఢిల్లీ సర్వీసుల బిల్లుపై నిప్పులు చెరిగిన విపక్షాలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 7 August 2023

ఢిల్లీ సర్వీసుల బిల్లుపై నిప్పులు చెరిగిన విపక్షాలు !


ఢిల్లీ సర్వీసుల బిల్లును ఏం చేసైనా సరే సాధించాలని బీజేపీ అనుకుంటోందని, ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని, ప్రాథమికంగా ప్రజావ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి అన్నారు. ఢిల్లీ సీనియర్ ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పగించే ఆర్డినెన్స్ స్థానే ఢిల్లీ సర్వీసుల బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారంనాడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఈ బిల్లు మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదం పొందడంతో రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు. వెంటనే బిల్లుపై చర్చ ప్రారంభమైంది. విపక్షాల తరఫున కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి చర్చలో పాల్గొంటూ, ఏ విధంగానైనా బిల్లుకు ఆమోదం పొందడం ద్వారా ఢిల్లీ సర్వీసుల అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని బీజేపీ అనుకుంటోందని విమర్శించారు. ఇది ప్రాంతీయ, ఢిల్లీ ప్రజల ఆకాంక్షలపై నేరుగా జరుపుతున్న దాడిగా ఆయన పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, సివల్ సర్వీస్ అకౌంటబిలిటీ, అసెంబ్లీ ఆధారిత ప్రజాస్వామాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఆయన అన్నారు. బిల్లుపై చర్చ సందర్భంగా 26 విపక్ష పార్టీల కూటమికి చెందిన ఎంపీలు సభకు హాజరయ్యారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ ఎంపీలకు సభకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ విప్‌లు జారీ చేశాయి.

కాగా, ఈ బిల్లును మొదట్నించీ వ్యతిరేకిస్తూ వస్తున్న కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా ఈ చర్చలో పాల్గొంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో జరిగిన గత ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణమైన ఓటమి చవిచూసిందని, ఆ కారణంగానే బీజేపీ ఈ బిల్లు తీసుకువచ్చిందని ఆరోపించారు. 25 ఏళ్లుగా బీజేపీ గెలుపునకు దూరమైందని, కేజ్రీవాల్ ప్రభుత్వం కారణంగా మరో 25 ఏళ్ల తాము గెలువలేమనే విషయం బీజేపీకి బాగా తెలుసునని అన్నారు. ఆ కారణంగానే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ధ్వంసం చేయాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. తమ హక్కు గురించే తప్ప మరొకటి ఏమీ తాము కోరుకోవడం లేదన్నారు. ఢిల్లీ సర్వీసుల బిల్లు ఒక 'పొలిటికల్ ఫ్రాడ్' అని, కన్‌స్టిట్యూషనల్ సిన్ అని, ఢిల్లీలో ప్రభుత్వ యంత్రాగాన్ని స్తంభింప చేయడానికి ఉద్దేశించిన బిల్లు రాఘవ్ చద్దా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ యంత్రాంగంపై తమ అధికారులను స్తంభింపజేయడం ద్వారా రాజ్యాంగం ప్రసాదించిన తమ అధికారాలను హస్తగతం చేసుకోవాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. సమష్టి బాధ్యతను గుర్తుచేసే పార్లమెంటరీ సిద్ధాంతాలను బలహీనపరచడమే ఈ బిల్లు ఉద్దేశమని అన్నారు. రాజ్యాంగ నేరానికి కేంద్రం పాల్పడుతోందని విమర్శించారు. ఇప్పుడు ఆఫీసర్లు ఎవరూ ముఖ్యమంత్రి, మంత్రులు మాట వినే పరిస్థితి ఉండదన్నారు. ఈ చర్య ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలని తోసిరాజనడమేనని అన్నారు.

No comments:

Post a Comment