రక్షాబంధన్ కానుకగా తమ్మునికి కిడ్నీ దానం చేయడానికి ముందుకొచ్చిన అక్క ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 30 August 2023

రక్షాబంధన్ కానుకగా తమ్మునికి కిడ్నీ దానం చేయడానికి ముందుకొచ్చిన అక్క !


త్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో సోదరుడికి ఓ సోదరి అరుదైన రక్షాబంధన్ కానుక ఇచ్చింది. కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న అన్నకు రెండు కిడ్నీలు దెబ్బతినగా తన కిడ్నీని ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఓంప్రకాష్ ధంగర్ (48) అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. డయాలసిస్ మీదనే ఆధారపడి జీవిస్తున్నాడు. ఎవరైనా కిడ్నీ దానంచేస్తే తప్ప కిడ్నీ మార్పిడి చేయించుకునే ఆర్థిక స్తోమతలేదు. అతని రెండు కిడ్నీలు దాదాపు పాడైపోయాయి. డయాలసిస్ మీదనే జీవిస్తున్నాడు. ఒక కిడ్నీ 80 శాతం, మరొకటి 90 శాతం దెబ్బతిన్నాయి. అతని వైద్య ఖర్చుల కోసం కుటుంబం అప్పులపాలైంది. అయినా అతనిని బతికించుకునేందుకు కుటుంబ సభ్యలు చాలా కష్టపడుతున్నారు. గుజరాత్‌ లోని నాడియాడ్‌ ఆసుపత్రిలో అతనికి కిడ్నీ మార్పిడి చేయాలని కుటుంబం  నిర్ణయించుకుంది.దాత కోసం ఎదురు చూస్తున్నారు. కానీ దానికి తగిన దాత దొరకలేదు. దీంతో సోదరుడి ఆరోగ్యం గురించి తెలుసుకున్న ఓంప్రకాశ్ అక్క షీలాబాయి పాల్ సోదరుడు ఓంప్రకాశ్ కు తన కిడ్నీ ఇస్తానంటు ముందుకొచ్చింది. దీంతో ఓంప్రకాశ్ కుటుంబం సంతోషం వ్యక్తంచేసింది. దీంతో ఆమెకు అవసరమైన అన్ని పరీక్షలు చేశారు డాక్టర్లు. ఆమె కిడ్నీ సరిగ్గా సరిపోతుందని చెప్పటంతో సెప్టెంబర్ 3న కిడ్నీ ఆపరేషన్ చేసేందుకు సిద్ధమయ్యారు. షీలాబాయి తన తమ్ముడు క్షేమంగా ఉండాలనే ఆకాంక్షతో ఇలా చేస్తున్నానని తెలిపింది. దీంతో ఈ రక్షాబంధన్ వేడుక రోజున కిడ్నీ మార్పిడికి ముందు, షీలాబాయి ఓం ప్రకాష్‌కు తన భద్రత కోసం ప్రతిజ్ఞగా రాఖీని కట్టింది. నువ్వు క్షేమంగా ఉంటావు తమ్ముడు అంటూ అక్కగా ఆశీర్వదించింది. 

No comments:

Post a Comment