కొండచరియలు విరిగిపడి పది బాలుడితో సహా ముగ్గురు మృతి

Telugu Lo Computer
0


త్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో పార్కింగ్‌ స్థలంలో నిలిచి ఉన్న కార్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఒక కారులో చిక్కుకున్న పసిబాబుతో సహా ఇద్దరు మహిళలు మరణించారు.  సోమవారం చంబా పోలీస్ స్టేషన్ సమీపంలోని ట్యాక్సీ స్టాండ్‌ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండరాళ్లు, మట్టి కింద పలు వాహనాలు చిక్కుకున్నాయి. శిథిలాల నుంచి ఒక కారును బయటకు తీశారు. నాలుగు నెలల శిశువు, ఇద్దరు మహిళలు అందులో నలిగి మరణించినట్లు గుర్తించారు. మృతదేహాలను వెలికి తీశారు. మృతులను 30 ఏండ్ల పూనమ్ ఖండూరి, ఆమె నాలుగు నెలల కుమారుడు, 32 ఏండ్ల వదిన సరస్వతీ దేవిగా పోలీసులు గుర్తించారు. కాగా, విరిగిన కొండచరియల కింద చిక్కుకున్న పలు వాహనాలను వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సంఘటన వల్ల న్యూ తెహ్రీ, చంబా రోడ్డు మార్గం మూసుకుపోయింది. దీంతో తెహ్రీ, రిషికేశ్ హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. అలాగే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు కొండచరియలు విరిగి పడిన భారీ శబ్దం విన్న స్థానికులు భయంతో తమ ఇండ్ల నుంచి బయటకు పరుగులుతీశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)