చంద్రుడిపై ఖనిజాలను గుర్తించిన చంద్రయాన్-3

Telugu Lo Computer
0


చంద్రయాన్-3 ల్యాండర్ నుండి కిందికి దిగిన రోవర్ చంద్రుడి ఉపరితలంపై తిరుగాడుతూ పరిశోధనలు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో రోవర్ చంద్రుడిపై పలు ఖనిజాల జాడను కనుగొంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ధృవీకరించింది. శివ శక్తి పాయింట్ వద్దనున్న ల్యాండర్ నుండి జాబిల్లి నేలపైకి జారుకున్న రోవర్ మరుక్షణం నుంచే కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైంది. చంద్రుడి ఉపరితలం యొక్క ఉష్ణగ్రత వివరాలను ఇదివరకే ఇస్రోకు చేరవేసిన రోవర్ ఇప్పుడు చంద్రుడిపై పలు ఖనిజాల జాడను కనుగొంది. ఈ క్రమంలో రోవర్‌లోని లేజర్-ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్  పరికరం దక్షిణ ధృవంలోని చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ ఉనికి పుష్కలంగా ఉన్నట్లు నిర్ధారించింది. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు కూడా పుష్కలంగా ఉన్నటు గుర్తించింది. అలాగే క్రోమియం, టైటానియం, కాల్షియం, మాంగనీస్, సిలికాన్, అల్యూమినియం, ఇనుము వంటి మరికొన్ని ఖనిజాలు కూడా ఉన్నట్లు గుర్తించింది. హైడ్రోజన్ కోసం ఇంకా రోవర్ పరిశోధిస్తోందని తెలిపింది ఇస్రో.

Post a Comment

0Comments

Post a Comment (0)