వర్షాకాలం - రోగనిరోధక శక్తిని పెంచే పండ్ల రసాలు !

Telugu Lo Computer
0


ర్షాకాలంలోని తేమ వాతావరణం, వర్షపు నీరు కారణంగా ప్రజలు తరచూగా ఆరోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా జలుబు, జ్వరం, ఇతర అంటు వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలోనే మెరుగైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి వర్షాకాలంలో రోగనిరోధకశక్తి పెంపొందించుకోవాలంటే కొన్ని రకాల పండ్ల రసాలను తాగితే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.

నేరేడు పండ్ల రసం: వేసవి, వర్షాకాలం మధ్య కాలంలో విరివిగా లభించే నేరేడులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉన్న విటమిన్ సీ శరీర ఆరోగ్యాన్ని కాపాడడానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అందువల్ల వర్షాకాలంలో నేరేడు పండ్ల రసం తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఫాల్సా జ్యూస్: ఫాల్సా పండ్ల రసం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఫాల్సా లేదా ఇండియన్ బెర్రీగా ప్రసిద్ధి చెందిన ఈ పండ్లలో క్యాల్షియం, ప్రొటీన్, మెగ్నీషియం, ఇంకా పలురకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. కాబట్టి వర్షాకాలంలో ఫాల్సా జ్యూస్ కూడా తాగవచ్చు.

చెర్రీ జ్యూస్: పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే చెర్రీ పండ్లతో కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఏ, విటమిన్ బీ, పోటాషియం వంటివి ఉండడం వల్ల ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

దానిమ్మ రసం: దానిమ్మ పండులో శరీరానికి ఎంతో మేలు చేసే లక్షణాలు ఉన్నాయి. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల రక్తహీనత దూరమవుతంది. ఇంకా ఇందులోని పోషకాల కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపడుతుంది.

ఆరెంజ్ జ్యూస్: నారింజ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగకరంగా ఉంటాయి. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)