నాలో ఫైర్‌ ఇంకా అలాగే ఉంది !

Telugu Lo Computer
0


జిత్ పవార్ తనపై చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ శనివారం బదులిచ్చారు. సోదరుడి కుమారుడైన అజిత్‌ పవార్‌పై విరుచుకుపడ్డారు. ‘రిటైర్’ అవ్వాలని అజిత్ పవార్ చేసిన సూచన మేరకు.. తాను అలసిపోనని, రిటైర్మెంట్ తీసుకోనని, తనలో ఇంకా ఫైర్‌ అలాగే మిగిలి ఉందని అన్నారు. పార్టీ కార్యకర్తలు తనను కొనసాగించాలని కోరినట్లుగానే తాను పని చేస్తూనే ఉంటానని ఎన్సీపీ అధినేత చెప్పారు. అజిత్‌పై మాటల దాడి చేసిన శరద్ పవార్.. “అతను (అజిత్ పవార్‌) నాకు ఏమి చెబుతున్నా నాకు పట్టింపు లేదు. నేను అలసిపోలేదు, పదవీ విరమణ చేయలేదు, నాలో ఫైర్‌ ఇంకా ఉంది. త్వరలో తిరుగుబాటుదారులందరూ ఎన్సీపీ నుంచి అనర్హులు అవుతారు.” అని శరద్‌ పవార్ అన్నారు. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ పవార్‌ గురించి అడిగిన ప్రశ్నలన్నింటికీ శరద్ పవార్‌ ఏ మాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చారు. “మొరార్జీ దేశాయ్ ఏ వయసులో ప్రధాని అయ్యారో తెలుసా? నాకు ప్రధానమంత్రి కావాలన్నా, మంత్రి కావాలన్నా కోరిక లేదు, ప్రజలకు సేవ చేయడమే నా కోరిక. నాకు ఇంకా వయసు రాలేదు.” అని అన్నారు. 

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పిన మాటలను పవార్ రిపీట్ చేస్తూ.. నేను అలసిపోను, రిటైర్‌ కూడా కాను. నన్ను రిటైర్ అవ్వమని అడగడానికి అతను (అజిత్ పవార్‌) ఎవరు? నేను ఇంకా పని చేయగలనన్నారు. కుటుంబ వారసత్వ పోరులో అజిత్ తన కొడుకు కానందున పక్కన పెట్టారని శరద్ పవార్‌ని మీడియా అడిగిన ప్రశ్నకు పవార్ మాట్లాడుతూ, "ఈ విషయంపై నేను పెద్దగా చెప్పదలచుకోలేదు. కుటుంబ సమస్యలను కుటుంబం వెలుపల చర్చించడం నాకు ఇష్టం లేదు.” అని చెప్పారు. అజిత్‌ను మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిని కూడా చేశారని, అయితే ఆయన కుమార్తె సుప్రియా సూలేకు మంత్రి పదవి ఇవ్వలేదని పవార్ అన్నారు. కేంద్రంలో ఎన్సీపీకి ఎప్పుడు మంత్రి పదవి వచ్చినా ఇతరులకు ఇచ్చారని, ఎంపీగా ఉన్నప్పటికీ సుప్రియకు ఇవ్వలేదన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు కూడా 75 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేస్తారని పేర్కొంటూ తన బాబాయ్‌, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తప్పుకుని కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బుధవారం అన్నారు. ఆ వ్యాఖ్యలకు శరద్‌ పవార్ స్పందించడం గమనార్హం.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)