చైనాతో మోడీ చర్చల సంగతి తేల్చాలి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 28 July 2023

చైనాతో మోడీ చర్చల సంగతి తేల్చాలి !


ప్రధాని మోడీ చైనాతో రాజీపడ్డారా? లాలూచీకి దిగారా? తేలాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. చైనా అధినేత జిన్‌పింగ్‌తో ప్రధాని మోడీ ఏం మాట్లాడారనేది జాతికి తెలియాల్సి ఉందన్నారు. సరిహద్దు వివాదా పరిష్కారంపై మోడీ చైనాతో ఏకాభిప్రాయానికి వచ్చినట్లా? లేక దేశం తరఫున చైనాకు రాయితీలు కల్పించారా? నిజానిజాలు వెల్లడికావల్సి ఉందన్నారు. గత ఏడాది బాలీలో జరిగిన జి 20 సదస్సు సందర్భంగా మోడీ జిన్‌పింగ్ మధ్య చర్చలు జరిగినట్లు ఒక్కరోజు క్రితం విదేశాంగ మంత్రిత్వశాఖ నిర్థారించింది. ద్వైపాక్షిక సంబంధాల స్థిరీకరణకు పాటుపడాల్సి ఉందని ఈ దశలో ఇరువురు నేతలు అంగీకరించారని , ఇరువురు మధ్య సృహద్భావ రీతిలో చర్చలు జరిగినట్లు ఇందులో వివరించారు. వీరి అప్పటి భేటీ కేవలం పరస్పర పలకరింపులకే పరిమితం కాలేదని అంతకు మించి ఈ భేటీలో చర్చలు జరిగాయని తెలిపారు. అయితే బాలీ సదస్సు దశలో ఇరువురు నేతల మధ్య అత్యంత కీలకమైన ఏకాభిప్రాయం కుదిరిందని ఇటీవల చైనా పేర్కొనడంపై కాంగ్రెస్ స్పందించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విట్టర్ ద్వారా ఈ చర్చల అర్థం ఏమిటీ? చైనా ప్రకటన సారాంశం ఏమిటని ప్రశ్నించారు. సరిహద్దుల్లోని దెస్పాంగ్, దెమ్చోక్‌ల నుంచి చైనా సైన్యం వెనుదిరుగుతుందా? ఇంతకు కుదిరిన ఏకాభిప్రాయం ఏమిటని స్పందించారు. ఇంతకు ముందటి ఒప్పందాలకు అతీతంగా చైనా సేనలు ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉంటే ఇక ఇరువురు నేతల మధ్య కుదిరిన సయోధ్యకుఅర్థం ఏమిటని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment