జుట్టు రాలే సమస్య తీరాలంటే తినే ఆహారంలో ఇవి ఉండేటట్లు చూసుకోండి !

Telugu Lo Computer
0


గుడ్లలో జింక్‌తో పాటు అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. ఈ రెండు పదార్థాలు జుట్టు రాలడాన్ని నివారించి కేశాల పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి. అందుకే జుట్టు సంరక్షణ కోసం గుడ్డు హెయిర్ మాస్క్‌లను ఉపయోగించమని కూడా నిపుణులు చెబుతుంటారు. అవిసె గింజలు జింక్, ప్రోటీన్ వంటి అవసరమైన పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. గుడ్లు లాగానే పప్పు కూడా అనేక పోషకాలకు నిలయం. పప్పులో జింక్ సహా ప్రోటిన్, కార్బోహైడ్రేట్స్ వంటి అనేక పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మీ ఆహారంలో పప్పు ఉండేలా చూసుకోండి. గుమ్మడి గింజలు కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గుమ్మడి గింజల్లో విటమిన్ ఇ, ఐరన్, జింక్ ఉంటాయి. ఇంకా గుమ్మడి గింజలు జుట్టు రాలడాన్ని నివారించి కేశాల పెరుగుదలకు సహాయపడతాయి. దాదాపుగా అన్ని రకాల విత్తనాలు, గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా ప్రతిరోజూ బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు, అవిసె గింజలు, చియా గింజలు వంటివాటిని మీ ఆహారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)