ప్రపంచంలో మూడో ఆర్థిక దేశంగా మారనున్న భారత్‌ !

Telugu Lo Computer
0


భారత్‌ ప్రపంచంలోని మూడో ఆర్థిక దేశంగా మారనుందని ప్రధని నరేంద్ర మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా ‘రోజ్‌గార్ మేళా’ సందర్బంగా 70,000 మంది యువతకు ప్రధాని జాబ్ లెటర్‌లను వర్చువల్‌గా ఈరోజు అందజేశారు. కొత్తగా నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్న వేళ, ప్రభుత్వోద్యోగిగా పనిచేసే అవకాశం రావడం గొప్ప గౌరవమని, భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఈ దేశ ప్రజలు తీర్మానం చేశారని అన్నారు. వచ్చే 25 ఏళ్లు భారత్‌కు చాలా ముఖ్యమైనవని ప్రధాని అన్నారు. మరి కొన్ని సంవత్సరాలలో, భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలోకి వస్తుందని ప్రతి నిపుణుడు చెబుతున్నాడు. దీని అర్థం ఉపాధి అవకాశాలు మరియు పౌరుల తలసరి ఆదాయం పెరుగుతుందని ప్రధాని మోదీ తెలిపారు. గత ప్రభుత్వంపై విరుచుకుపడిన ప్రధాని మోడీ వారి హయాంలో బ్యాంకింగ్ రంగం భారీ విధ్వంసానికి గురైందన్నారు. ‘బ్యాంకింగ్‌ రంగం అత్యంత పటిష్టంగా భావించే దేశాల్లో నేడు భారత్‌ ఒకటి. కానీ 9 ఏళ్ల కిందటి పరిస్థితి ఇది కాదు.. గత ప్రభుత్వ హయాంలో మన బ్యాంకింగ్‌ రంగం భారీ విధ్వంసాన్ని చవిచూసింది. నేడు డిజిటల్‌ లావాదేవీలు చేయగలుగుతున్నాం. కానీ 9 ఏళ్ల క్రితం 140 కోట్ల మందికి ఫోన్‌ బ్యాంకింగ్‌ ఉండేది కాదని మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో రోజ్‌గర్ మేళా జరిగింది. ఈ చొరవకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు UTలలో రిక్రూట్‌మెంట్‌లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన కొత్త రిక్రూట్‌మెంట్‌లు, రెవెన్యూ శాఖ, ఆర్థిక సేవల విభాగం, పోస్ట్‌ల శాఖ, పాఠశాల విద్యా శాఖ, ఉన్నత విద్యా శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జలవనరుల శాఖ, ట్రాన్స్ పోర్ట్, హోం మంత్రిత్వ శాఖతో సహా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో యువత ప్రభుత్వ ఉద్యోగంలో చేరనున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)