డ్రైవర్లకు, వాహన యజమానులకు రతన్ టాటా విజ్ఞప్తి !

Telugu Lo Computer
0


వర్షా కాలంలో పిల్లులు, వీధి కుక్కులు వంటి జంతువులు పార్క్ చేసి ఉండే కార్లు, లారీలు వంటి వాహనాల కింద ఆశ్రయం పొందుతుంటాయి. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు వాటికి ఎలాంటి హాని కలిగించకుండా చూసుకోవాలంటూ రతన్ టాటా ట్విట్టర్ వేదికగా డ్రైవర్లకు, వాహన యజమానులకు విజ్ఞప్తి చేశారు. జంతువులకు వాహనాల కింద తాత్కాలిక ఆశ్రయం కల్పించగలిగితే అది సంతోషకరమైనదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వర్షాకాలం మెుదలైంది. ఈ సమయంలో తమను తాము రక్షించుకునేందుకు సమీపంలోని కార్లు, వ్యాన్లు వంటి పార్క్ చేసిన వాహనాల కింద కుక్కలు, పిల్లులు వంటి జంతువులు ఆశ్రయం పొందుతుంటాయి. అందువల్ల వాహనాలను నడపేందుకు స్టార్ట్ చేసే ముందు చెక్ చేయటం.. జంతువులకు గాయాలు కాకుండా చూడటం మంచిదని రటన్ టాట్ కోరారు. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు అజాగ్రత్తగా ఉండటం వల్ల అవి గాయపడటం, అవిటివి కావటం లేదా మరికొన్ని సార్లు మరణిస్తుంటాయని వెల్లడించారు. ఈ సీజన్‌లో వర్షాలు కురుస్తున్నప్పుడు మనమందరం వారికి తాత్కాలిక ఆశ్రయం కల్పిస్తే బాగుంటుందని జంతు ప్రేమికులకు రతన్ టాటా సూచించారు. పెంపుడు జంతువులంటే రతన్ టాటాకు ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. 2018లో లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో అప్పటి ప్రిన్స్ చార్లెస్ నుంచి జీవితకాల పురస్కారాన్ని అందుకోవడానికి ఆయన వెళ్లలేదు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన పెంపుడు కుక్కల్లో ఒకటైన టిటో అనారోగ్యంతో ఉండటమే అందుకు కారణం. ఆయనకు జంతువులంటే ఎంత ప్రేమో చెప్పటానికి ఇదొక మంచి ఉదాహరణ.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)