మహాలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు

Telugu Lo Computer
0


హాలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ బ్యాంక్ కార్నాటక కేంద్రంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు నేపథ్యంలో ఈ బ్యాంక్ ఇకపై కేవలం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా (ఎన్‌బీఎఫ్‌సీ) మాత్రమే పని చేయనుంది. బ్యాంక్ లైసెన్స్ రద్దు నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చిందని ఆర్‌బీఐ వెల్లడించింది. జూన్ 27 నుంచి బ్యాంక్ బిజినెస్ పని చేయదని తెలిపింది. నాన్ బ్యాంకింగ్ కంపెనీగా మాత్రమే ఈ బ్యాంక్ కొనసాగుతుందని పేర్కొంది. రిజర్వు బ్యాంక్ 1994లో మహలక్ష్మీ సహకార బ్యాంక్‌కు బ్యాంకింగ్ లైసెన్స్‌ను జారీ చేసింది. అయితే ఇప్పుడు ఈ లైసెన్స్ రద్దు చేసింది. ఆర్‌బీఐ గత కొంత కాలంగా కోఆపరేటివ్ బ్యాంకులపై డేగ కన్ను వేసింది. 2023 ఏప్రిల్ నుంచి చేస్తే.. ఆర్బీఐ అడోర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లైసెన్స్‌ను కూడా రద్దు చేసింది. ఎన్‌బీఎఫ్‌సీ సంస్థగా మాత్రమే కొనసాగడానికి అవకాశం కల్పించింది. ఇంకా దాదాపు 8 బ్యాంకులు లైసెన్స్ రద్దు చేసింది. అంటే ఆర్‌బీఐ కోఆపరేటివ్ బ్యాంకుల విషయంలో ఎంత కచ్చితంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోఆపరేటివ్ బ్యాంకుల పనితీరును ఆర్‌బీఐ ఎప్పటి కప్పుడు అంచనా వేస్తూ వస్తోంది. తనిఖీలు నిర్వహిస్తోంది. వీటిల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లు తెలిస్తే.. వెంటనే కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)