టపాసుల గోదాంలో పేలుడులో ఐదుగురు దుర్మరణం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 29 July 2023

టపాసుల గోదాంలో పేలుడులో ఐదుగురు దుర్మరణం


మిళనాడులోని కృష్ణగిరి జిల్లా పాళయపేటలో టపాసుల గోదాంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ఐదుగురు మరణించగా, మరో పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు అంబులెన్సు సహాయంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటన విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలంకు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే భారీగా మంటలు ఎగిసి పడడంతో గోదాం పూర్తిగా దగ్దమైంది. పేలుడు జరిగిన గోదాం నివాస సముదాయాల మధ్యనే ఉండటంతో పేలుడు ధాటికి మూడు ఇళ్లు కుప్పకూలాయి. ఘటన స్థలంలో పోలీసులు, అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యుల రోధనలతో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment