పంటలకు కనీస మద్దతు ధర పెంపు !

Telugu Lo Computer
0


వాతావరణ మార్పులతో, అకాల వర్షాలతో, పంటల్లో వచ్చే వివిద వ్యాధులతో రైతులు పండించే పంటలకు తీవ్ర నష్టం వస్తుంది. దీనికి తోడు పండించిన పంటకు సరియగు ధర రాక అన్నదాతలు తీవ్రంగా నష్ట పోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించింది. దీంతో దళారీ వ్యాపారులతో చేతుల్లో మోసపోతున్న రైతులకు ఇది ఊరటనిచ్చే అంశమని చెప్పాలి. ఎంఎస్ పి అనేది ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే ధరను సూచిస్తుంది. మార్కెట్ లో చోటుచేసుకునే అనూహ్య మార్పులు, ధరల్లో తేడాలు వచ్చినపుడు ఈ ఎంఎస్ పి అనేది రక్షిస్తుంది. అయితే తాజాగా కేంద్రం పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ మద్దతు ధరలకు సంబందించిన విషయాలను వెల్లడించారు. సాధారణ వరి రకానికి క్వింటాల్ కు రూ. 143 పెంచింది. దీంతో వరి క్వింటాల్ ధర రూ. 2,183 కు చేరింది. గ్రేడ్ ఎ రకానికి రూ. 163 పెంచడంతో రూ. 2,203 కు చేరింది. అదేవిధంగా పెసర పంటకు 10.4 శాతం పెంచడంతో క్వింటాల్ కు రూ. 8,558 కు ధర చేరింది. వేరుశనగకు కనీస మద్దుతు ధర 9 శాతం పెంచింది. హైబ్రిడ్ జొన్న క్వింటాల్ రూ.3,180, జొన్న రూ.3,225, రాగి రూ.3,846, సజ్జలు రూ.2500, మొక్కజొన్న రూ.2,090, పత్తి మధ్యస్థాయి పింజ రూ.6,620, పత్తి పొడవు పింజ రూ.7,020 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించింది. ఖరీఫ్ పంటలకే ఈ కనీస మద్దతు ధర వర్తించనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)