తక్కువ సమయంలో అన్ని ఢిల్లీ మెట్రో స్టేషన్లను సందర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన శశాంక్ మను !

Telugu Lo Computer
0


ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి అరుదైన రికార్డు సృష్టించాడు. అతితక్కువ సమయంలో దేశరాజధాని ఢిల్లీ లోని అన్ని మెట్రో స్టేషన్లను కవర్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు లో చోటు సంపాదించుకున్నాడు. ఫ్రీలాన్స్ పరిశోధకుడిగా పనిచేస్తున్న శశాంక్ మను  ఏప్రిల్ 2021లో ఈ ఘనత సాధించాడు. 15 గంటల 22 నిమిషాల 49 సెకన్లలో ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లను కవర్ చేశాడు. ముందుగా ఢిల్లీ మెట్రో గ్రీన్ లైన్ లో ఉన్న బ్రిగేడియర్ హోసియార్ సింగ్ స్టేషన్ లో తెల్లవారుజామున 5 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించిన మను.. అదే రోజు రాత్రి 8:30 గంటలకు అదే స్టేషన్ లో తన ప్రయాణాన్ని ముగించాడు. అయితే చిన్న అపార్థం కారణంగా జీడబ్ల్యూఆర్ నుంచి తన అధికారిక గుర్తింపును పొందలేకపోయాడు. దీంతో, మను తర్వాత ఆగస్టు 29, 2021లో ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లను 16 గంటల 2 నిమిషాల్లో కవర్ చేసిన ప్రఫుల్ సింగ్ కు గుర్తింపు దక్కింది. అంతకు ముందే ఏప్రిల్ 14న మను ఈ రికార్డును బద్దలు కొట్టినట్లు తర్వాత వెల్లడైంది. దీంతో తాజాగా అతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మను ఏప్రిల్ 2023లో ట్వీట్ చేశాడు. 'ఇప్పుడే అందింది. అన్ని ఢిల్లీ మెట్రో స్టేషన్లను అత్యంత వేగంగా సందర్శించినందుకు గానూ నాకు గిన్నిస్ రికార్డ్ నుంచి సర్టిఫికేట్ వచ్చింది' అంటూ సంతోషంగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)