వెండి ధర పైపైకి...!

Telugu Lo Computer
0


గత 48 గంటల్లో బంగారం ధర రూ.58,400 నుంచి రూ.58,300కి తగ్గినప్పటికీ వెండి ధర మాత్రం విపరీతంగా పెరిగింది. దీనికి కారణం అమెరికా పీఎంఐ గణాంకాలు, రష్యాలో పెరుగుతున్న అస్థిరత కారణమంటున్నారు నిపుణులు. అయితే ఈ రెండు దేశాలు వెండి ధరను పెంచేంత పెద్దవి కావు. మరోవైపు మెక్సికో, పెరూ వంటి దేశాల నుండి వచ్చిన నివేదికలు వెండి ధరలు మళ్లీ ఆకాశాన్నంటేలా ఉన్నాయి. గత 48 గంటల్లో వెండి ధర రూ.2300 పెరిగింది. వెండి విషయంలో మెక్సికోలో రెగ్యులేటరీ మార్పులు జరగనున్నాయి. దీని కారణంగా వెండి మైనింగ్‌లో పెట్టుబడులు తగ్గుతాయనే ఆందోళనలు పెరిగాయి. ప్రతిపాదిత నియంత్రణ మార్పులు వెండి మైనింగ్‌లో పెట్టుబడిని ప్రభావితం చేయగలవు. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా వెండి సరఫరా మరియు డిమాండ్‌ను ప్రభావితం చేస్తుంది. మరోవైపు జనవరి నుండి ఏప్రిల్ వరకు పెరూలో వెండి ఉత్పత్తిలో 7 శాతం క్షీణత ఉంది. అయితే ఉత్పత్తి తగ్గడం కూడా వెండి ధరలపై ప్రభావం పడింది. ఉత్పత్తిలో తగ్గుదల.. సరఫరాలో తగ్గుదలతో వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

గత శుక్రవారం నుంచి వెండి ధర రూ.2300 పెరిగింది. డేటా ప్రకారం.. శుక్రవారం వెండి కిలో రూ.68,371 ఉండగా, మంగళవారం కిలో వెండిపై రూ.2300 పెరిగింది. దీంతో మంగళవారం వెండి ధర కిలో రూ.70,675కి చేరింది. సోమవారం కూడా వెండి ధర రూ.1000కు పైగా పెరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)