ఈ సమావేశం నుంచే కొత్త చరిత్ర ప్రారంభమవుతుంది !

Telugu Lo Computer
0


పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల భేటీ అనంతరం మమతా బెనర్జీ  మాట్లాడుతూ ఈ సమావేశం నుంచే కొత్త చరిత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. చరిత్రను మారుస్తామని బీజేపీ చెబుతోంది.. కానీ దేశ చరిత్రను బిహార్‌ సమావేశం నుంచే కాపాడతామని మమత అన్నారు. జాత్యంహకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటమే తమ ప్రధాన ధ‍్యేయమని ఆమె చెప్పారు. దేశంలో ఇందిరా గాంధీ విధానాలకు వ్యతిరేకంగా 1974లో పట్నాలో జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలో మొదటిసారి ప్రతిపక్షాల భేటీ జరిగింది. ఇన్నాళ్ల తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ అదే వేదికగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నితీష్ కుమార్ అధ్యక్షతన ప్రతిపక్షాలు సమావేశం ఏర్పరచడం గమనార్హం. విధ్వంసం నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రతిపక్షాలు భేటీ అయ్యాయని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) లీడర్ ఒమర్ అబ్దుల్లా అన్నారు. అమెరికా కాంగ్రెస్‌లో సమావేశంలో ప్రధాని మోదీ వివరించిన ప్రజాస్వామ్యం కశ్మీర్‌లో ఎందుకు పనిచేయటం లేదని ప్రశ్నించారు. కశ్మీర్‌ నుంచి తాను మెహబూబా ముఫ్తీ హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. నేడు జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఎలాంటి ఏకాభిప్రాయానికి రానట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో మరోసారి భేటీ కానున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన అజెండాను చర్చిస్తామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)