తెలుగులో మాట్లాడాలని ఉంది : మీరా కుమార్

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సభకు మీరా కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆమె బోణం ఎత్తుకున్నారు. వేదికపై మీరా కుమార్ జై తెలంగాణ నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ఠాక్రే , ఏఐసీసీ సెక్రటరీ లు నదీమ్ జావిద్, రోహిత్ చౌదురి , ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపీలు,వీహెచ్ పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీరా కుమార్ మాట్లాడుతూ జై తెలంగాణ అని గట్టిగా నినదిద్దామని అన్నారు. తనకు తెలుగులో మాట్లాడాలని ఉందని, తెలుగు భాష చాలా అందంగా ఉంటుందన్నారు. 'మా నాన్న ఇక్కడికి వచ్చేవారు.. అప్పటి నుండే నాకు తెలుగుతో అనుబంధం ఉంది' అని అన్నారు. రాజ్యాంగ పరిధిలోనే తెలంగాణ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పాటు జరిగిందనడం హాస్యాస్పదం అన్నారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడిచినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణలో పరిస్థితులు మారనందుకు దుఖంగా ఉందని తెలిపారు. తెలంగాణ రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు అలాగే ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి కాస్త పక్కకి వెళ్లి చూస్తే తెలంగాణలో ఉన్న పరిస్థితులు తెలుస్తాయన్నారు. తెలంగాణలో పరిస్థితులు చూసి సోనియా, రాహుల్ బాధ పడుతున్నారని వెల్లడించారు. తెలంగాణ బాధలు మార్చడానికి కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలని తెలిపారు. అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్ళాలనేది కాంగ్రెస్ ఆలోచన అని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని తెలిపారు. 'మీరు ఎప్పుడు పిలిచినా.. ఒక కాల్ చేయగానే నేను తెలంగాణకి వచ్చేస్తా' అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)