తమిళనాట 'ది కేరళ స్టోరీ' సినిమా షోలు రద్దు !

Telugu Lo Computer
0


ది కేరళ స్టోరీ సినిమాకు తమిళనాట భారీ షాక్‌ తగిలింది. తమిళనాడులోని అన్ని మల్టిప్లెక్స్‌ థియేటర్లలో సినిమా ప్రదర్శనలను నిలిపివేశాయి. చెన్నై, కోయంబత్తూర్‌, మదురై, సేలంతోపాటు ముఖ్య నగరాల్లో మల్టీప్లెక్స్‌లో షోలు రద్దు చేశారు. సినిమా విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీ చెన్నైలో నిరసనకు దిగింది. సినిమాకు వ్యతిరేకంగా చెన్నై అన్నానగర్‌ అర్చ్‌ స్కై వాక్‌ మాల్‌ వద్ద పార్టీ అధినేత నటుడు, దర్మకుడు సీమన్‌ నేతృత్వంలో కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. సినిమాను బ్యాన్‌ చేయాలంటూ జెండాలు పట్టుకొని థియేటర్లలోకి ప్రవేశించి నినాదాలు చేశారు. సినిమాను ప్రదర్శించవద్దని థియేటర్ల యజమానులను, చూడవద్దని ప్రేక్షకులను సీమన్‌ విజ్జప్తి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా తమిళ నాడులోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆదివారం నుంచి ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వమే కాకుండా తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు సైతం సినిమాను ప్రదర్శిస్ థియేటర్లను సీజ్ చేస్తామని హెచ్చరించడంతో థియేటర్ల యజమానులు ఈ సినిమాను ప్రదర్శించేందుకు ఆసక్తి చూపడం లేదు. కేరళ స్టోరీ సినిమా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉందని, పుదుచ్చేరి, తమిళనాడు ప్రభుత్వాలు ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ గతంలో సీమాన్ డిమాండ్ చేశారు. కాగా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి సినిమాపై రాజకీయ దుమారం మొదలైన విషయం తెలిసిందే. కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తో సేన్‌ తెరకెక్కించారు. ఇందులో కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)