వంద గంటల్లో వంద కి.మీ రోడ్డు నిర్మాణం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 20 May 2023

వంద గంటల్లో వంద కి.మీ రోడ్డు నిర్మాణం


సాధారణంగా రోడ్డు వేయాలంటే చాలా టైం పడుతుంది. మట్టిపోయాలి.. కంకర వేయాలి.. తారుపోయాలి. వాటి రోలింగ్ చేయాలి ఇలా కొన్నిరోజులు నెలల టైం పడుతుంది. కానీ వంద రోజుల్లో వంద కిలోమీటర్ల రోడ్డు వేసి చరిత్ర సృష్టించారు. ఇది గజియాబాద్ – అలీగడ్ ఎక్స్‌ప్రెస్ వే పై జరిగింది. 100 కిలోమీటర్ల రోడ్డును 100 గంటల్లో నిర్మించినట్టు అధికారిక ప్రకటన శుక్రవారం ప్రభుత్వం వెల్లడించింది. ఈ విజయం మన దేశంలో రోడ్డు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమకు గల పట్టుదల, కమిట్‌మెంట్‌ను తెలియజేస్తుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, గజియాబాద్, అలీగడ్ సెక్షన్ ఆఫ్ ఎన్‌హెచ్ 34.. సుమారు 118 కిలోమీటర్ల మేరకు ఉన్న దారి కీలకపాత్ర పోషిస్తుందన్నారు. జన సాంధ్రత అధికంగా ఉండే గజియాబాద్, అలీగడ్‌లను కలుపుతున్న ఈ రోడ్డు కీలక పాత్ర నిర్వహిస్తుందని తెలిపారు. ఈ హైవే ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి, గౌతమ్ బుద్ధ నగర్, సికింద్రబాద్, బులంద్‌షహర్, ఖుర్జాలను కలుపుతుంది. సరుకుల రవాణాకు ఈ దారి కీలకంగా ఉపయోగపడనుంది. అలాగే, ఈ రీజియన్ ఆర్థిక అభివృద్ధికి, పారిశ్రామిక ప్రాంతాలు, సాగు ప్రాంతాలను, విద్యా సంస్థలను కలిపే ఈ దారి అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి తెలిపారు. 100 గంటల్లోనే ఈ రోడ్డును 100 కిలోమీటర్ల మేరకు పూర్తి చేశారన్నారు. ఈ వినూత్న హరిత సాంకేతికత 90 శాతం మిల్డ్ మెటీరియల్‌ను ఉపయోగిస్తుందని అన్నారు. ఫలితంగా పది శాతం వర్జిన్ మెటీరియల్స్‌ను వినియోగితం 10 శాతానికి తగ్గుతుందని వివరించారు. ఈ విధానాన్ని ఎంచుకుని చమురు వినియోగాన్ని చాలా వరకు తగ్గించామని చెప్పారు. గ్రీన్ హౌజ్ గ్యాస్ ఉద్గారాలు తగ్గుతాయని, తద్వారా కార్బన్ ఫుట్‌ప్రింట్ చాలా వరకు తగ్గుతుందని వివరించారు.

No comments:

Post a Comment