హైదరాబాద్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. హుస్సేనియాలం పోలీస్టేషన్‌ పరిధిలోని ఎయిర్‌కూలర్ షాప్, ఆటో విడిభాగాలోని 2 షాపుల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున పొగలు అలుముకోవడంతో ఇద్దరు చిక్కుకున్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు కూడా మంటలను అదుపు చేసేందుకు సహకరించారు. స్థానికులు ఇళ్ల నుంచి నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్థానిక సమాచారంతో సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ఇద్దరిని కాపాడి సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. రాత్రంతా శ్రమించి మంటలను అదుపుచేశారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు అధికారులు. ఆస్తి నష్టం ఎంత జరిగిందనే దానిపై అధికారులు ఆరాతీస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)