సీబీఐ వ్యవహారం చిల్లర చేష్టగా ఉంది ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 26 May 2023

సీబీఐ వ్యవహారం చిల్లర చేష్టగా ఉంది !


తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌లో ముఖ్యమంత్రి జగన్‌ పేరును ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ భారీ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. అసలు దీనిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ విపరీత ధోరణికి, సెన్సేషనలైజేషన్‌కు ఇది నిదర్శనమన్నారు. సీబీఐ దిగజారిపోయి వ్యవహరిస్తోందన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్‌ను, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ను టార్గెట్‌ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ఎల్లోమీడియా ప్రచారం చేసుకుంటూ వస్తోందని, ఒక స్క్రిప్టు రాసుకుని, దాని విస్తృతంగా ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఎలాంటి ఆధారాలు లేకుండా చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు. కేవలం సెన్షేషనలైజేషన్‌ కోసమే ఇవన్నీ చేస్తున్నారు. సీబీఐ ఏం చేయాలనుకుంటుందో ఈ ఎల్లోమీడియాకు ఎలా ముందుతెలుస్తోంది. ఎల్లోమీడియా స్క్రిప్టు తయారుచేస్తుంటే దాన్ని సీబీఐ మెన్షన్‌ చేస్తోంది. దర్యాప్తు సంస్థ ఏదైనా మెన్షన్‌ చేస్తే దానికి ఆధారాలు చూపిస్తుంది. కానీ ఇక్కడ అదేమీ జరగలేదు. ముందే అనుకుని అవినాష్‌రెడ్డి అరెస్టులకు ఏం కావాలో రాస్తున్నారు. సీబీఐ ఆ అంశాలను ప్రస్తావించగానే మేం ముందుగానే చెప్పాం కదా అని అంటున్నారు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం సాగిపోతోంది. సీబీఐ కౌంటర్‌ వేయకుముందే దానిలో పొందుపరిచే అంశాలను ముందుగా ఎల్లోమీడియా ప్రచారం చేస్తోంది. సీబీఐ తీరులో విపరీత ధోరణి, అత్యంత అన్యాయమైన తీరు కనిపిస్తోందని ఆరోపించారు సజ్జల. ఉన్నట్టుండి..సడన్‌గా.. జగన్మోహన్‌రెడ్డిగారి పేరును ప్రస్తావించడమే దీనికి నిదర్శనం. అసలు దీనికి ఏ ఆధారమేదీ వాళ్లదగ్గర ఏమీ కనిపించడంలేదు. ఇదంతా చూస్తుంటే చిల్లర చేష్ట మాదిరిగా ఉందని, జగన్మోహన్‌రెడ్డిగారి పేరును ప్రస్తావించి దాన్ని సెన్షేషనలైజేషన్‌కోసం వాడుకోవాలన్న తీరు కనిపిస్తోందని విమర్శించారు. సీబీఐ ఇలా కౌంటర్‌ అఫిడవిట్‌ విషయం తెలియగానే, టీడీపీ పొలిట్‌ బ్యూరోలో దీనిపై చర్చించడం, జగన్‌గారి పాత్ర అందరికీ తెలుసంటూ వారు ఆరోపణలు చేయడం.. ఇదంతా గొలుసుకట్టు మాదిరిగా ఈ వ్యవహారం నడుస్తోంది. ఇది ఒక పెద్ద కుట్ర. ఈ వ్యవహారం నడుస్తోంది.

No comments:

Post a Comment