కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించిన అమర్త్యా సేన్‌ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 4 May 2023

కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించిన అమర్త్యా సేన్‌


కోల్‌కతాలోని శాంతినికేతన్‌లో ఆక్రమించిన స్థలాన్ని ఖాళీ చేయాలని అమర్త్యా సేన్‌కు విశ్వభారతి యూనివర్సిటీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నోబెల్ గ్రహీత అమర్త్యా సేన్ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఖాళీ స్థలాన్ని సేన్ అక్రమంగా అక్రమించారని, ఒకవేళ మే 6వ తేదీ అక్కడ నుంచి ఆయన వెళ్లకుంటే, తామే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని విశ్వభారతి యూనివర్సిటీ తన ఆదేశాల్లో పేర్కొన్నది. జస్టిస్ బిబాస్ రంజన్ దే నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారించనున్నది. తన తండ్రి అశుతోష్ సేన్‌కు 1943 అక్టోబర్‌లో విశ్వభారతి వర్సిటీ 1.38 ఎకరాల భూమిని 99 ఏళ్లకు లీజు ఇచ్చిందని, ఆ భూమిలోనే ప్రతీచి బిల్డింగ్‌ను కట్టినట్లు అమర్త్యా సేన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ సేన్‌కు మద్దతుగా ఆయన ఇంటి ముందు ధర్నా చేపట్టాలని మంత్రులను సీఎం మమతా బెనర్జీ కోరారు. మరో వైపు తాము ఆ బిల్డింగ్‌ను కూల్చడం లేదని విశ్వభారతి అధికారి ఒకరు తెలిపారు.

No comments:

Post a Comment