అత్తను అట్ల పెనంతో కొట్టి చంపిన కోడలు !

Telugu Lo Computer
0


కోల్‌కతాకు చెందిన సుర్జీత్ సామ్ (51), షర్మిష్ఠ సామ్ (48) దంపతులు ఢిల్లీలోని నెబ్ సరాయి ఏరియాలో 2014 నుంచి నివాసముంటున్నారు. అయితే కోల్‌కతాలో ఉంటున్న సుర్జీత్ తల్లి (86) అనారోగ్యానికి గురికావడంతో కొడుకు 2022లో ఢిల్లీకి తీసుకొచ్చాడు. తన ఇంటి ముందే ఓ కిరాయి గదిలో తల్లిని ఉంచాడు. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న అత్తకు సేవలు చేయలేక ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 10:30 గంటలకు అత్త ఉంటున్న గదిలోకి వెళ్లి దోశ పెనంతో  షర్మిష్ట దాడి చేసింది. దీంతో సుర్జీత్ తల్లి తీవ్ర గాయాలై మరణించింది. ఆ తర్వాత తనకేమీ తెలియనట్లు భర్తకు ఈ విషయం తెలిపింది. భర్త సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా వృద్ధురాలి ముఖం, తలపై అనేక గాయాలతో వంటగదిలో పడి ఉందని తెలిపారు. తన తల్లి చాలా కాలంగా ఆర్థరైటిస్‌తో బాధపడుతోందని, నడవడానికి కూడా ఇబ్బంది పడుతోందని సుర్జిత్ చెప్పాడు. నడవలేక కిందపడి తలకు గాయమై మరణించిందని అనుకున్నారంతా. కానీ మృతదేహాన్ని ఎయిమ్స్ మార్చురీకి తరలించి ఏప్రిల్ 29న శవపరీక్ష నిర్వహించగా డాక్టర్ సాధారణంగా పడిపోవడం వల్ల ఇలాంటి గాయాలు జరగవని, సమగ్ర విచారణ జరపాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) చందన్ చౌదరికి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సుర్జీత్. సీసీ టీవీ ఫుటేజ్ కనిపించకుండా జాగ్రత్త పడిన భార్యను ప్రశ్నించాడు. తన తల్లి, అమ్మమ్మల మధ్య సత్సంబంధాలు లేవని సుర్జిత్ కూతురు కూడా పోలీసులకు చెప్పింది. మొత్తానికి పోలీసులు ఆమె దాచి ఉంచిన మెమరి కార్డును, కెమెరాను స్వాధీనం చేసుకోగా అసలు నిజం బయటపడింది. ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో షర్మిష్ట తన అత్త ఉంటున్న గదిలోకి దోశ పెనంతో ప్రవేశించినట్లు సిసిటివి ఫుటేజీలో కనిపించింది. సీసీటీవీ కవరేజీ లేని వంటగదిలో ఉన్న బాధితురాలి వెనుకకు వెళ్లి.. ఆమెను ఫ్రైయింగ్ పాన్ తో చాలా దెబ్బలు కొట్టింది. ఈ సమయంలో సీసీటీవీ లో వృద్ధ మహిళ అరుపులు, ఏడుపులు కూడా రికార్డ్ అయ్యాయని చౌదరి తెలిపారు. షర్మిష్ట అరెస్ట్ చేశారు. అయితే వృద్ధురాలిని జాగ్రత్తగా చూసుకోవాల్సి రావడం, రోజువారీ దినచర్యలో ఆమెకు సహాయం చేయడంతో విసుగు చెందే షర్మిష్ట ఇలా చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)