బ్రిజ్ భూషణ్ సింగ్‌ ను అరెస్టు చేయనందున ఢిల్లీ పోలీసులకు మహిళా కమిషన్ సమన్లు

Telugu Lo Computer
0


ఢిల్లీ పోలీసులకు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ బుధవారం సమన్లు జారీ చేసింది. పోక్సో కేసులో బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్టు చేయడంలో విఫలమైనందుకు ఢిల్లీ పోలీసులకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ సమన్లు జారీ చేశారు.లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.మైనర్‌తో సహా మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధించినట్లు సింగ్‌పై ఆరోపణలు ఉన్నాయి. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఫిర్యాదు చేసేందుకు రెజ్లర్లు ఏప్రిల్ 21న కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే అప్పట్లో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు.జంతర్ మంతర్ వద్ద రైతులు రెజ్లర్ల ఆందోళనతో బ్రిజ్ భూషణ్ అరెస్టుకు మే 21వతేదీ గడువు విధించారు. మహిళా రెజ్లర్లు ఆందోళన చేయడంతోపాటు వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం ఆదేశంతో ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ తెలుసుకున్న తర్వాత జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)కి సమన్లు జారీ చేసి, ఈ అంశంపై వివరణ కోరారు. యాక్షన్ తీసుకున్న నివేదికతో మే 12న కమిషన్ ముందు హాజరు కావాలని కమిషన్ డీసీపీని కోరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)