తుగ్లక్ ఫర్మానా !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ రూ.2వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ఈ చర్య “మన స్వయం-శైలి విశ్వగురుకి విలక్షణమైనది”. “ఫస్ట్ యాక్ట్, సెకండ్ థింక్..(మొదటి చేసి, తర్వాత ఆలోచించడం)” అనేది ఆయన పద్ధతి అని జైరామ్ రమేశ్ మండిపడ్డారు. 2016 నవంబర్ 8న నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి విపత్తుకు నాంది పలికిందని, ఇప్పుడు రూ.2వేల నోట్ల ఉపసంహరణ మరోసారి విపత్తుకు ఇది ఆరంభం అని జైరాం రమేశ్ అన్నారు. పెద్ద నోట్ల రద్దును ''తుగ్లక్ ఫర్మానా''గా జైరామ్ రమేశ్ అభివర్ణించారు.పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లను ఇప్పుడు ఉపసంహరించుకోవడం ద్వారా ''సెకండ్ డెమో డిజాస్టర్ స్టార్ ప్రారంభమైటన్లే.. M = మ్యాడ్ నెస్'' అంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా కూడా కేంద్రాన్ని నిందించారు. ” 2016 నవంబర్ 8 దెయ్యం మరోసారి దేశాన్ని వెంటాడడానికి తిరిగి వచ్చింది” అని ట్వీట్ చేశారాయన. రూ. 2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లను సెప్టెంబర్ 30లోగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చని సూచించింది. నవంబర్ 2016లో రూ. 2,000 డినామినేషన్ బ్యాంక్ నోట్ ప్రవేశపెట్టబడింది. ప్రాథమికంగా ఆర్థిక వ్యవస్థ కరెన్సీ అవసరాన్ని త్వరగా తీర్చడానికే రూ.2వేల నోటు తీసుకొచ్చామంది. ”ఆర్‌బీఐ చట్టం-1934లోని సెక్షన్‌ 24(1) ప్రకారం రూ.2వేల నోటును ప్రవేశపెట్టాం. పెద్దనోట్ల రద్దు తర్వాత కరెన్సీ నోట్ల డిమాండ్ కు సరిపడా కరెన్సీని మార్కెట్‌లో అందుబాటులో ఉంచేందుకే ఈ నోటును తీసుకొచ్చాం. మార్కెట్‌లో అవసరమైన కరెన్సీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. 2018-19లోనే రూ.2వేల నోటును ముద్రించడం నిలిపివేశాం. ప్రస్తుతం చలామణీలో ఉన్న రూ.2వేల నోట్లన్నీ మార్చి 2017కు ముందు ముద్రించినవే. వాటి జీవితకాలం 4-5ఏళ్లు మాత్రమే” అని ఆర్బీఐ స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)