ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై మార్గదర్శకాలు జారీ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధం సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు కేటగిరీలుగా ఉద్యోగుల బదిలీల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిక్వెస్ట్ బదిలీలకు గరిష్టంగా రెండేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి అవకాశం కల్పించారు. అదే విధంగా అయిదేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి బదిలీ తప్పని సరి చేస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు. టీచర్లతో పాటుగా ఇతర ఉద్యోగులకు బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ సారి బదిలీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. బదిలీలను రెండు కేటగిరీలుగా చేసింది. కొన్నిశాఖల ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయించింది. ఈ నెల 22 నుంచి 31 వరకూ బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2023 ఏప్రిల్ 30కి అయిదేళ్లు పూర్తి చేసుకున్న వారిని బదిలీకి అర్హులుగా పేర్కొంది. రిక్వెస్ట్.. పాలనా పరమైన నిర్ణయాల్లో భాగంగా బదిలీలు జరగాలని స్పష్టం చేసింది. పాఠశాల విద్యా, ఇంటర్ , సాంకేతిక, ఉన్నత విద్యా శాఖల ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయించింది. రెండేళ్లు పని చేసిన వారిని రిక్వెస్ట్ మీద బదిలీకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీల్లో ముందుగా గిరిజన ప్రాంతాల్లోని పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేసిన అనంతరం ఇతర ప్రాంతాలపై దృష్టి పెడతామని ప్రభుత్వం పేర్కొంది. ఆదాయాన్ని ఆర్జించే శాఖలుగా ఉన్న వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజు, రవాణా, వ్యవసాయ శాఖలు కూడా నిబంధనలకు అనుగుణంగానే మే 31 లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. బదిలీ ప్రక్రియలో ఏసీబీ కేసులు, విజిలెన్సు విచారణ పెండింగ్ లో ఉన్న వారి అంశాలను తెలియచేయాలని ఆయా శాఖలకు ఆర్దిక శాఖ సూచించింి. ఈ నెల 31వ తేదీ బదిలీలకు చివరి రోజుగా పేర్కొన్న ప్రభుత్వం..తిరిగి జూన్ 1 తేదీ నుంచి మళ్లీ ఉద్యోగుల బదిలీలపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)