తన వర్గంతో డీకే శివకుమార్ భేటీ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 17 May 2023

తన వర్గంతో డీకే శివకుమార్ భేటీ !


కర్ణాటకలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల మధ్య సీఎం పీఠం కోసం పోటీ నెలకొంది. అయితే సిద్దరామయ్య వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు కర్ణాటకలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ ట్విస్ట్ ఇచ్చింది. ముఖ్యమంత్రిని ఇంకా నిర్ణయించలేదని చెబుతూనే 48-72 గంటల్లో కర్ణాటకలో ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేస్తుందని కర్ణాటక కాంగ్రెస్ ఇంఛార్జ్ రణదీప్ సుర్జేవాలా చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు ఇద్దరు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. అంతకుముందు డీకే, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చాలా సేపు సమావేశం అయ్యారు. ఈ పరిణామాల అనంతరం డీకే శివకుమార్ తన వర్గం నేతలు, నాయకులతో సమావేశం అయ్యారు. శివకుమార్ సోదరుడు ఎంపీ సురేష్ ఇంటిలో ఆయన వీరిందరితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు సాయంత్రం మరోసారి డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

No comments:

Post a Comment