చీతా బృందంపై గ్రామస్థుల దాడి

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ కునే నేషనల్ పార్క్‌లో ప్రాజెక్ట్ చీతా బృందంపై గ్రామస్థులు దాడి చేశారు. రక్షిత ప్రాంతం నుంచి తప్పిపోయిన చీత 'ఆశ' కోసం అధికారుల రాత్రి వేళలో గస్తీ నిర్వహించింది. ఈ క్రమంలో దారిదోపిడి దొంగలు అనుకుని స‍్థానిక గ్రామస్థులు ఆ బృందంపై దాడి చేశారు. ప్రాజెక్టు చీతాలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో చీత ఆశ రక్షిత ప్రాంతం నుంచి బయటకు తప్పిపోయింది. చీత మెడకు కట్టిన జీపీఎస్ ట్రాకర్‌ను గమనిస్తూ ఫారెస్ట్‌ అధికార బృందం రాత్రి వేళలో గస్తీ నిర్వహిస్తోంది. బురఖేడా గ్రామ సమీపంలో చీత కోసం వెతుకుతున్నారు. గ్రామం చుట్టూ అప్పటికే నాలుగుసార్లు తిరిగారు. అయితే పశువులను దొంగలించిన ఘటనలు ఇటీవల ఆ గ్రామంలో జరిగిన నేపథ్యంలో.. చీత కోసం గాలిస్తున్న అధికారులను దొంగలని స్థానికులు భావించారు. అంతేగాక వారు ధరించిన దుస్తులు కూడా వారి అనుమానాలను మరింత పెంచాయి. దీంతో రాళ్లతో, కర్రలతో చీతా బృందంపై దాడి చేశారు గ్రామస్థులు. ఈ ఘటనలో నలుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. అటవీ శాఖ వాహనం కూడా పాడైపోయింది. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)