జూన్ 22 నుంచి బోనాల పండుగ ప్రారంభం

Telugu Lo Computer
0


తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ జూన్ 22న హైదరాబాద్ గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానుండగా, జూలై 10న ఊరేగింపు నిర్వహించనున్నారు. పాతబస్తీలో బోనాల ఉత్సవాలు జూలై 16న ప్రారంభమై మరుసటి రోజు జూలై 17న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించనున్నారు.ఈ ఏడాది ఉత్సవాల కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నిర్వహిస్తామని చెప్పారు. ఆషాఢ మాసంలో బోనాలు నిర్వహించడం ప్రతి ఏడాది అనావాయితీగా వస్తోంది. జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుచప్పుల్లు వెళ్లి దేవికి కల్లు శాఖతో పాటు నైవేద్యం సమర్పిస్తారు..

Post a Comment

0Comments

Post a Comment (0)