రాష్ట్రపతి ఔన్నత్యాన్ని మోడీ ప్రభుత్వం అగౌరవపరుస్తుంది !

Telugu Lo Computer
0


హిందూత్వ సిద్ధాంతకర్త విడి సావర్కర్‌ జయంతి మే 28న నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ భవనాన్ని మోడీ ప్రారంభించడమేంటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా సోమవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కేవలం ఎన్నికల కోసమే మోడీ ప్రభుత్వం దళిత, గిరిజన వర్గాల నుంచి రాష్ట్రపతిని ఎన్నుకునేలా చేసింది' అని ఆయన విమర్శించారు. ఇక కొత్త పార్లమెంట్‌ భవన శంకుస్థాపన కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఆహ్వానించలేదని, కొత్త పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కూడా ఆహ్వానించడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా.. 'రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా యొక్క సుప్రీం లెజిస్లేటివ్‌ బాడీ పార్లమెంట్‌. దాని అత్యున్నత రాజ్యాంగ అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. ఆమె మాత్రమే ప్రభుత్వం, ప్రతిపక్షం, ప్రతిపౌరునికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె భారతదేపు మొదటి పౌరురాలు. ఆమె చేత కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ఔన్నత్యానికి, ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీక'గా నిలుస్తుంది అని ఖర్గే అన్నారు. కాగా, 'రాష్ట్రపతి ఔన్నత్యాన్ని మోడీ ప్రభుత్వం పదేపదే అగౌరవపరచింది. బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ హయాంలో భారత రాష్ట్రపతి కార్యాలయం టోకెనిజంకు దిగజరింది' అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)